వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సోషల్ మీడియా విభాగంపై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పెంచి పోషిస్తున్న ‘పేటీఎం బ్యాచ్’ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె గట్టిగా హెచ్చరించారు.
సొంత తల్లిని, చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన దుర్మార్గుడు జగన్ అని అనురాధ విమర్శించారు. కల్తీ మద్యంతో రాష్ట్రంలో సుమారు 30 వేల మంది ప్రాణాలు తీసి, ఎందరో తల్లులకు కడుపుకోత మిగిల్చారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో యువతతో తప్పుడు పోస్టులు పెట్టించి, వారిని జైలు పాలు చేస్తూ తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో జగన్ చేయిస్తున్న ఇలాంటి వికృత చేష్టల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
World Cup Cricket: వరల్డ్ కప్ స్టార్ శ్రీచరణికి ఘనస్వాగతం; సీఎం చంద్రబాబు, లోకేష్‌తో భేటీ!
Village and Ward Secretariats: గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త పేరు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
“భాస్కర్ రెడ్డి లాంటి వారిని ఎంతమందిని ప్రయోగించినా, వారంతా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయం” అని అనురాధ స్పష్టం చేశారు. తలా తోక లేని వ్యాఖ్యలతో మహిళలను కించపరిచే వారు అసలు మనుషులేనా అని అనురాధ నిలదీశారు. “పనికిమాలిన పేటీఎం బ్యాచ్‌తో ఇంకెంత కాలం విషప్రచారం సాగిస్తారు? ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదా?” అని ప్రశ్నిస్తూ ఆమె జగన్, ఆయన అనుచరుల తీరుపై మండిపడ్డారు.

