టీఆర్‌ఎస్‌కి మజ్లిస్‌ వెన్నుపోటు.. ఎక్కడ తేడా కొట్టిందంటే.!

trs party ready to face ghmc elections

తెలంగాణ రాష్ట్ర సమితికి మజ్లిస్‌ పార్టీ వెన్నుపోటు పొడిచినట్లేనా.? అన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. మజ్లిస్‌ సాయంతో, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ గట్టెక్కాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఓటు బ్యాంకు ఈక్వేషన్స్‌ నేపథ్యంలో మజ్లిస్‌తో వ్యూహాత్మక వైరాన్ని అందరికి కన్పీంచేలా చూపిస్తోంది గులాబీ దళం. ‘బస్తీ మే సవాల్‌’ అంటూ ఒకరి మీదకు ఇంకొకరు దూసుకొస్తున్నారు టీఆర్‌ఎస్‌ నుంచీ, మజ్లిస్‌ పార్టీ నుంచీ. మంత్రి కేటీఆర్‌ అయితే, తన ప్రచారాల్లో మజ్లిస్‌ పేరెత్తకుండానే ‘పిచ్చోడు’ అంటూ టార్గెట్‌ చేస్తున్న వైనం అందరికీ అర్థమవుతోంది. అయితే, మజ్లిస్‌ ఇలాంటి విషయాల్లో ఒకింత సీరియస్‌గానే వ్యవహరిస్తుంటుంది. ఒకవేళ మజ్లిస్‌ గనుక, కేటీఆర్‌ విమర్శల్ని సీరియస్‌గా తీసుకోవడమే నిజమైతే, గ్రేటర్‌ ఎన్నికల్లో ఈక్వేషన్స్‌ అనూహ్యంగా మారిపోతాయి.

cm kcr
cm kcr

ఆ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడమే లక్ష్యమా.?

హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడిపోతాయని అనగలమా.? కానీ, కొన్ని చోట్ల మైనార్టీల ఓట్లు గంపగుత్తగా మజ్లిస్‌కి మాత్రమే పడతాయి. మజ్లిస్‌ పోటీ లేని చోట్ల ఆ ఓట్లు టీఆర్‌ఎస్‌కి పడేలా తెరవెనుక వ్యూహాలు ఎప్పుడో ఖరారయ్యాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే, మజ్లిస్‌ – టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధాన్ని వ్యూహాత్మక రాజకీయంగా చూడాలే తప్ప, అధికారంలో వున్న పార్టీలతో మజ్లిస్‌ కొట్లాడటం అనేది నిజంగా జరగబోదని ఇంకొందరు కుండ బద్దలుగొట్టి మరీ చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

బీజేపీకి మజ్లిస్‌ సాయం చేస్తోందంటే నమ్మేదెవరు.!

బీహార్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా మజ్లిస్‌ పార్టీ సాయం చేసిందన్న విమర్శలున్నాయి. అక్కడ నితీష్‌కుమార్‌ పార్టీకి తక్కువ సీట్లు రావడం వెనుక, మజ్లిస్‌ కీలక పాత్ర పోషించిందట. ఆయా నియోజకవర్గాల్లో మజ్లిస్‌కి ఓ సెక్షన్‌ ఆఫ్‌ ఓటు బ్యాంకు అండగా నిలిచింది. అలా ఓట్లు చీలి, ప్రత్యర్థులకు న్యాయం జరిగింది. మరి, బీజేపీ ఎలా గట్టెక్కింది? అంటే, ఆయా స్థానాల్లో ఆ ఓటు బ్యాంకు బీజేపీ వైపుకు మళ్ళిందట. ఇదెలా సాధ్యం? అన్నదానిపై లోతుగా విశ్లేషించిన కొందరు (ఆ వర్గానికి చెందినవారే) మజ్లిస్‌ – బీజేపీ తెరవెనుక అవగాహన కుదుర్చుకున్నాయనే ఆరోపణలు చేశారు.

కమలం రాజకీయ వ్యూహాల్ని అంచనా వేయలేం

సర్జికల్‌ స్ట్రైక్స్‌ సహా అనేక రకాలైన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ నుంచి రావడం, వాటిపై మజ్లిస్‌ తీవ్రంగా స్పందించడం చూశాం. అయితే, ఈ మాటల యుద్ధంలో ఆయా పార్టీల చిత్తశుద్ధి ఎంత? అన్నదానిపై చాలా మందికి చాలా చాలా అనుమానాలున్నాయి. ఫలానా ఓటు బ్యాంకు ఫలానా విధంగా చీలితే, ఫలానా పార్టీకి లాభం.. అనే ఈక్వేషన్స్‌కి అనుగుణంగా ఈ రాజకీయాలు నడుస్తున్నాయని అనుకోవచ్చు. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. లేదూ, ఇదంతా ఉత్తి దుష్ప్రచారం, మజ్లిస్‌ – టీఆర్‌ఎస్‌ స్నేహాన్ని విడగొట్టడానికి కొందరు పన్నుతున్న కుట్ర.. అని ఎవరన్నా అన్నా, దాన్నీ తేలిగ్గా కొట్టి పారేయలేం.