ఒకే ఒక్కడు కేటీఆర్‌.. టీఆర్‌ఎస్‌ని ఈసారీ గెలిపిస్తాడా.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు రంగంలోకి దిగారు. అసలు, ఎవరు ప్రచారానికి దూరంగా వున్నారని.? ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా భారీ బహిరంగ సభలో తనదైన పవర్‌ పంచ్‌ డైలాగులతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ, ఈ తరహా ఎన్నికల్లో అస్త్ర శస్త్రాలన్నీ మోహరించడం సహజమే. ప్రచారం జరిగినన్నాళ్ళూ మొత్తంగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే పార్టీ కోసం పనిచేశారు. అయితే, సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా మారింది మాత్రం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావే. గత గ్రేటర్‌ ఎన్నికల్లోనూ పార్టీని కేటీఆర్‌ ఒంటిచేత్తో గెలిపించారనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడూ ఆయనే, బాధ్యత తీసుకున్నారు. అప్పటి ఎన్నికల్లో గెలుపు తర్వాత కేటీఆర్‌కి ప్రమోషన్‌ వచ్చింది. మరిప్పుడు ఏం ప్రమోషన్‌ వస్తుంది.? ప్రమోషన్‌ రావాలంటే, టీఆర్‌ఎస్‌ సెంచరీ కొట్టాల్సిందే మరి.! కొడుతుందా.? లేదా.?
ktr is key role of trs
ktr is key role of trs

మాటల్ని తూటాల్లా పేల్చిన కేటీఆర్‌

ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్‌. ఆ మాటకొస్తే, తండ్రిని మించిన తనయుడని అనుకోవచ్చు కూడా. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌నీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌నీ ‘పిచ్చోళ్ళు’గా అభివర్ణించారు కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం సందర్భగా. ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శల్ని తనదైన స్టయిల్లో తిప్పి కొట్టారు. తమ హయాంలో హైద్రాబాద్‌ ఎంతలా అభివృద్ధి జరిగిందో చెప్పేందుకు ప్రయత్నించారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ వరదల నేపథ్యంలో తలెత్తిన సమస్యల్నీ, ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన సాయాన్నీ వివరించగలిగారు. ప్రధానంగా అభివృద్ధి గురించి చెప్పడం కంటే కూడా, ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడం మీదనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు కేటీఆర్‌. ఈ క్రమంలో కొన్నిసార్లు కేటీఆర్‌ కూడా సంయమనం కోల్పోయారు.. అదే సమయంలో, ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పడంలో కొంతమేర విఫలమయ్యారు కూడా.
ktr is key role of trs
ktr is key role of trs

సెటిటర్లకు గాలం వేయడంలో సఫలమయ్యారా.?

తెలంగాణ ఉద్యమంలో ఏవేవో మాట్లాడేశాం. అది భావోద్వేగాల సందర్భం. ఆ తర్వాత ఎప్పుడూ ఎక్కడా సెటిలర్లకు ఇబ్బంది రానివ్వలేదని కేటీఆర్‌ చెప్పుకున్నారు. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, వివాదాస్పద అంశాల్నీ తెరపైకి తెచ్చింది. మజ్లిస్‌ తక్కువేమీ తినలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ ఎలాంటి భాష ఉపయోగించందో, అదే భాషని మజ్లిస్‌తోపాటు బీజేపీ ఉపయోగించింది. అది కాస్తా ‘పాత గాయాల్ని’ తవ్వినట్లయ్యింది.. సెటిలర్లకు సంబంధించి. దాన్ని డీల్‌ చేయడంలో కేటీఆర్‌ తడబడ్డారు. అయితే, గత గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి అండగా నిలిచిన సెటిలర్లు, ఈసారి మాత్రం ఎందుకు దూరం పెడతారు.? అన్నది ఇంకో చర్చ.
ktr is key role of trs
ktr is key role of trs

సెంచరీ కొడితే.. కొత్త కేటీఆర్‌ని చూస్తామేమో.!

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌, గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. ఖచ్చితంగా కేటీఆర్‌కి ప్రమోషన్‌ ఇస్తారు. పార్టీలో నెంబర్‌ టూ.. ప్రభుత్వంలో నెంబర్‌ టూ పొజిషన్‌లో ఆల్రెడీ వున్న కేటీఆర్‌కి ప్రమోషన్‌ అంటే, అది ఖచ్చితంగా నెంబర్‌ వన్‌ పొజిషనే. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.