కేసీయార్.. తప్పు కదా.? ప్రధాని మోడీని అలా అనొచ్చా.?

ప్రధాని నరేంద్ర మోడీని పట్టుకుని ఏకంగా సేల్స్ మెన్ అనేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఔను, దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన్ని అలా అనడం ముమ్మాటికీ తప్పే. కానీ, కేసీయార్.. ఏకంగా దేశ ప్రధానిని చప్రాసితో పోల్చేశారు. సో, చప్రాసి కంటే సేల్స్ మెన్ కాస్త బెటర్ అయిన ప్రస్తావన.

చప్రాసి.. అన్నదెవర్నో కాదు, మన్మోహన్ సింగ్‌ని.. అది తెలంగాణ ఉద్యమ కాలం. అప్పుడు కేసీయార్, తెలంగాణ ఉద్యమ నాయకుడు. కానీ, ఇప్పుడు కేసీయార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో, బాధ్యత వుండాలి.. మాట్లాడేటప్పడు.!

ప్రధాని నరేంద్ర మోడీ, ‘దేశ భవిష్యత్తు కోసం’ అని చెబుతూ, ఎయిర్ ఇండియాని అమ్మేయొచ్చు.. విశాఖ స్టీలు స్లాంటుని అమ్మేస్తుండొచ్చు.. అంతమాత్రాన సేల్స్ మేన్ అంటారా.? అలాగైతే, తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తోన్న భూముల మాటేమిటి.?

ఎవరు అధికారంలో వున్న చేసేది అమ్మకమే.! ఔను, అధికారం అంటేనే వ్యాపారం. ఎవరు ఎంత బాగా వ్యాపారం చేశారన్నదే కీలకంగా మారుతోందిప్పుడు. అప్పులు చేసి, రాష్ట్రాల్ని, దేశాన్ని ఉద్ధరించేసే రాజకీయ నాయకులు పాలకులవుతున్నారు.

ఎప్పుడైతే ఓటేయడానికి కరెన్సీ నోట్లను జనం తీసుకుంటున్నారో.. అప్పుడే, రాజకీయం వ్యాపారమైపోయినట్టు. రాజకీయమంటే వ్యాపారం.. అధికారం అంటే వ్యాపారం. కేసీయార్ చేసేది అయినా, నరేంద్ర మోడీ చేసేది అయినా, వైఎస్ జగన్ చేసేది అయినా.. అంతా వ్యాపారమే.!