కేసీఆర్ పాలనపై తెలంగాణ రాష్ట్రములో అన్ని వర్గాల నుండి వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే అధికారం ఉండటంతో బయట పడటం లేదు, కాకపోతే చాప కింద నీరుగా మెల్లగా వ్యాపిస్తుంది. ఇది రేపొద్దున తెరాస కొంప ముంచే అవకాశం వుంది. ఇకపోతే తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలిచి చట్ట సభలో అడుగుపెట్టింది. ఇదే అదునుగా భావించిన కేసీఆర్ తన కూతురికి హోమ్ మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు కొన్ని వర్గాల నుండి సమాచారం వస్తుంది.
ప్రస్తుతం హోమ్ మంత్రిగా వున్నా మహమ్మద్ అలీని పక్కన పెట్టి, ఆయన స్థానంలో కవితను కూర్చోబెట్టాలని చూస్తున్నాడు, ఒక మహిళా నాయకురాలు హోమ్ మంత్రి పదవి ఇచ్చి, తెలంగాణలో మహిళా రక్షణకు పెద్ద పీట వేయబోతున్నాం అంటూ గొప్పగా చెప్పుకోవాలని చూస్తున్నారు, ఈ నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ పాలనా అనే పేరు కేసీఆర్ ప్రభుత్వానికి వుంది. ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు ఇద్దరు రెండు కీలకమైన శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కవిత ను తీసుకోని వచ్చి హోమ్ మంత్రి పదవి కట్టబెడితే కుటుంబ పాలనకు జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అవుతుంది.
ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను మళ్ళీ ఎమ్మెల్సీ గా పోటీచేపించి, ఆమె కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి, కాంగ్రెస్ కి చెందిన దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులను లోబరచుకొని భారీ విజయం సాధించటం పట్ల తెలంగాణ ప్రజానీకం నుండి వ్యతిరేకత వస్తుంది, ఇక సోషల్ మీడియా లో అయితే దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వ్యతిరేకత వున్నా కవితకు కీలకమైన హోమ్ మంత్రి పదవి ఇవ్వటం, దాని కోసం తెలంగాణ ఉద్యమంలో మైనారిటీ వర్గం నుండి కేసీఆర్ తో కలిసి పోరాటం చేసిన మహమ్మద్ అలీని బలిచేయటం ఎంత వరకు న్యాయమనే మాటాలు కూడా మేధావి వర్గాల నుండి వినిపిస్తున్నాయి.
మ్యాన్ హోల్స్ మరమత్తులు నుండి కాళేశ్వరం మహా ప్రాజెక్టు వరకు ప్రతి దానిలో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తముందని, తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, రాష్ట్రము విడిపోయే సమయంలో మిగులు నిధులు కలిగిన స్థాయి లో ఉన్న రాష్ట్రము నేడు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని స్థితికి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ కుటుంబ పాలనా, ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి, మేధావుల వర్గం కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఇలాంటి సమయంలో కవిత కు హోమ్ మంత్రి పదవి ఇస్తే ప్రజా వ్యతిరేకత రావటం ఖాయం. ఎంత ప్రజా ఉద్యమ నేతైనా సరే, వాళ్లలో వ్యతిరేకత రానంతవరకు మాత్రమే, ఒక్కసారి వ్యరేకత మొదలైతే ఎంతటి రాజకీయ చతురత కలిగిన నేతలైన వైకుంఠపాళిలో పామునోటికి చిక్కినట్లే.