కేటీఆర్ క్యాబినెట్‌లో హరీష్, కవిత పక్కా.!

KTR is the chief minister but Harish rao, kavitha got a place in the cabinet

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఒకడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తన పుత్రరత్నానికి పట్టాభిషేకం చేయబోతున్నారనీ, తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో కేటీఆర్ కూర్చోబోతున్నారనీ ప్రపచారం జరుగుతున్న విషయం విదితమే. ఉత్త ప్రచారం మాత్రమే కాదిది.. పలువురు మంత్రలు, టీఆర్ఎస్ ముఖ్య నేతలూ కేటీఆర్‌కి అప్పుడే శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం పూర్తయిన దరిమిలా, ప్రారంభోత్సవం జరిగిన వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానంలో కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా నియమిస్తారంటూ టీఆర్ఎస్ నేతలు కొందరు చెబుతున్నారు. ఇదిలా వుంటే, కేటీఆర్ క్యాబినెట్‌లో కేసీఆర్ కుమార్తె కవితకు చోటు దక్కనుందనీ, ఆమెకు కీలక శాఖ బాద్యతలు అప్పగిస్తారనీ ఊహాగానాలు షురూ అయ్యాయి. మరి, హరీష్‌రావు సంగతేంటి.?

KTR is the chief minister but Harish rao, kavitha got a place in the cabinet
KTR is the chief minister but Harish rao, kavitha got a place in the cabinet

అంటే, ఆయనకు కీలకమైన హోంశాఖ దక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం హరీష్‌రావు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే, ఆ తర్వాత కేసీఆర్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ఎలా వుంటాయ్.? అన్నదానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికే నిర్ణయించుకున్న కేసీఆర్, ఆ దిశగా ఇప్పటికే తెరవెనుకాల గ్రౌండ్ వర్క్ పూర్తి చేసేశారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ లోపు ఎప్పుడైనా, కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అద్భుతమైన ముహూర్తాలున్నాయన్నది గులాబీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అయితే, ఈ విషయమై ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోవడం గమనార్హం. దీన్ని వ్యూహాత్మక మౌనం అనుకోవాలా.? లేదంటే, ఇంకేమన్నా అనుకోవాలా.?