గుండె ‘పోటు’.! అవన్నీ కోవిడ్ మరణాలేనా.?

ఒకటా.? రెండా.? ఇటీవలి కాలంలో ఎడా పెడా అకాల మరణాల్ని చూస్తున్నాం. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు తారకరత్న.. వీళ్ళే కాదు, చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే. చిన్న వయసులోనే గుండె పోటుకు గురవుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది.

ఎందుకిలా జరుగుతోంది.? ఈ విషయమై ‘కోవిడ్’ ప్రస్తావన తరచూ తెరపైకి వస్తోంది. కోవిడ్ సోకి తగ్గినవారు కావొచ్చు, కోవిడ్ రాకపోయినా.. వ్యాక్సిన్ తీసుకున్నవారు కావొచ్చు.. ఎక్కువగా ఈ అనూహ్యమైన గుండె పోటు బారిన పడి అకాల మరణం చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై వైద్యులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వుంది. ‘కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే.. అని చెప్పలేం. కానీ, కోవిడ్ వల్ల గుండె పోటు మరణాలు పెరిగాయ్..’ అని మాత్రం వైద్యులు చెబుతున్నారు. దీనర్థమేంటి.? వ్యాక్సిన్ వల్ల మరణం.. అంటే, వ్యాక్సిన్ వ్యాపారం ఏమైపోవాలి.?

కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల లక్షలాది, కోట్లాది ప్రాణాలు కాపాడామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, అదే కోవిడ్ వ్యాక్సిన్.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ‘గుండు పోటు’ సమస్యలకు కారణమవుతోందన్న ఆరోపణలున్నాయి. 18-20 ఏళ్ళ మధ్య వయసు వారికీ ఈ మధ్య గుండె పోటు, స్టెంట్లు వేయడం అనేది సర్వసాధారణమైపోయింది. మరణాలూ చోటు చేసుకుంటున్నాయి.

50 ఏళ్ళ పైబడినవారికి గుండె పోటు వస్తే అదో లెక్క. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. పది పదిహేనేళ్ళ పిల్లలూ గుండె పోటు బాధితులే. ఈ పాపం ఎవరిది.?