Gallery

Home Andhra Pradesh జెసి దివాకర్ రెడ్డి అసలు కనిపించడం లేదేంటి?... ఆ వార్తలు నిజమేనా?

జెసి దివాకర్ రెడ్డి అసలు కనిపించడం లేదేంటి?… ఆ వార్తలు నిజమేనా?

జెసి దివాకర్ రెడ్డి …ఒక విలక్షణ రాజకీయ నాయకుడు. తన ఫైర్ బ్రాండ్ తరహా స్వభావంతో పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీల నాయకులకే కాదు ఒక్కోసారి సొంత పార్టీ పెద్దలకు కూడా సున్నం పెట్టేసే వాళ్లు. అందుకేనేమో ఆయన అధికార పక్షంలో ఉన్నా,ప్రతి పక్షంలో ఉన్నా ఆయన హవా మాత్రం జోరుగా సాగిపోయేది. అలాంటి జెసి ఊసే ఇప్పుడు రాజకీయాల్లో వినిపించడం లేదు. అంతేకాదు అసలు బైటకు కనిపించడమే మానేశారు. జాతీయ స్థాయి ఛరిష్మాతో ఎంతో వయలెంట్ గా ఉండే ఈ నాయకుడు ఉన్నట్టుండి ఇంత సైలెంట్ అయిపోవడం రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన మౌనంపై సహజం గానే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Jc Diwakar Reddy
jc diwakar reddy

పొలిటికల్ రూట్ మారిందిలా…

జేసీ దివాకర్ రెడ్డి…ఈ పేరు చెప్పగానే కళ్లకు కూలింగ్ గ్లాసులతో తెల్లగా మెరిసిపోయే ఖద్దరు డ్రెస్ లో సినిమా టిక్ గా ఉండే పొలిటికల్ లీడర్ రూపం తెలుగువాళ్ల కళ్లముందు అలా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన ఈయన రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో అనంతపురం టిడిపి ఎంపిగా గెలిచారు. టిడిపి హయాంలో తనదైన శైలిలో పవర్ పాలిటిక్స్ నడిపిన జెసి ..ముందు నుంచి చెబుతున్నట్లే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. అలాగే జెసి బ్రదర్స్ గా గుర్తింపు పొందిన ఈయన సోదరుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో పోటీచేయలేదు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేయకుండా తమ కుమారులను బరిలోకి దింపారు. అయితే వారిద్దరూ ఓటమి పాలవడం వీరి పొలిటికల్ జర్నీలో ఒక పెద్ద ఎదురు దెబ్బ గా చెప్పుకోవచ్చు.

Jc Diwakar Reddy
jc diwakar reddy

మొదట్లో అడపా దడపా…

అయితే తమ కుమారులు ఎన్నికల్లో ఓటమి పాలయినా జెసి దివాకర్ రెడ్డి అడపాదడసా మీడియా ముందుకు వస్తూ తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. అయితే ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల ప్రభావమో ఏమో క్రమంగా అసలు రాజకీయాల్లో కనిపించడమే మానేశారు. మరోరకంగా చెప్పాలంటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇందుకు తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై పెట్టిన కేసులు, ఆ క్రమంలో సోదరుడు ఏకంగా జైలుకు వెళ్లాల్సిరావడం…ఇవే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Jc Diwakar Reddy
jc diwakar reddy

ఇలా చేస్తున్నారట…

అయితే జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడకూ వెళ్లలేదని ఆయన తమ రాజకీయ ఇలాకా తాడిపత్రిలోనే ఉంటున్నారట. తాను ముందు నుంచి చెబుతున్నట్లు తన ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ప్రశాంత జీవితం గడుపుతున్నారట. అయితే తన అనుచరులు, అభిమానులు వీరికి మాత్రం పూర్తిగా అందుబాటులోనే ఉంటున్నారట. ఇప్పుడు ఆయన్ని కలవాలనుకునేవారు ఇంటికి వెళ్లడం కాకుండా నేరుగా పొలం వద్దకే వెళుతున్నారటే. ఆయన్ని కలవాలంటే పొలం దగ్గరుకవద్దకు భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారట. ఒక్కమాటలో చెప్పాలంటే జెసి ఇప్పుడు ఇంటి దగ్గర కంటే పొలం వద్దే అత్యధిక సమయం గడుపుతున్నారట. దీంతో ఎవరైనా జెసిని కలవాలని అనుకుంటే నేరుగా పొలం వద్దకే వెళుతున్నారట. అలాగే అనుచరులు, అభిమానులు,కార్యకర్తలకు ఇబ్బంది వస్తే స్వయంగా వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించి వస్తున్నారట. ఆ రకంగా వారికి భరోసా ఇస్తున్నారట.

ఇటీవల పుకార్లతో వార్తల్లోకి…

అయితే ఇటీవలే జెసి దివాకర్ రెడ్డి పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. చంద్రబాబు వీరికి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అయ్యాక స్వయంగా పరామర్శించేందుకు మీ ఇంటికి వస్తానంటే వద్దని నిర్మొహమాటంగా చెప్పేశారట. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తమని ఫుల్ టార్గెట్ చేసిందని…ఇలాంటి సమయంలో చంద్రబాబు పరామర్శకు తమ ఇంటికి వస్తే ఆ ప్రభావంతో ళ్లీ కొత్త కేసులు, పాత కేసులు అన్నీ బైటకు తీయొచ్చనే ఉద్దేశంతో వద్దన్నారని, దీంతో చంద్రబాబు షాక్ తిన్నారని పుకార్లు వినిపించాయి. వీటిలో నిజమెంతో తెలీదు కానీ ఆయన అనుచరులతో చెబుతున్న మాటలను బట్టి బాబుతో కూడా అలా అనే ఉంటారని అనుకుంటున్నారు.

Jc 4 | Telugu Rajyam

అనుచరులతో సమావేశంలో…

ఇటీవలే తన అనుచరులతో, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన జెసి మనం ఇంకో మూడేళ్లు జాగ్రత్తగా ఉండాలి…ఎవరిపైనా విమర్శలు, దాడులు వంటివి చేసి టార్గెట్ కావద్దని…ప్రస్తుతం మనకి పరిస్థితులు అనుకూలంగా లేవని హితవు పలికారట. శత్రువులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, మనకి అనుకూల సమయం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అది చేయొచ్చని…అలాగైతేనే మంచి ఫ్యూచర్ ఉంటుందని నచ్చచెప్పారట. దీంతో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన మన జెసి గారే ఇలా అన్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందేనని అనుచరులు చర్చించుకున్నారని వినికిడి.

- Advertisement -

Related Posts

ప్రభాస్ సినిమా మొదలు.. మొదట అమితాబ్ మీదనే

ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఉండేలా రూపొందిస్తున్నారు. 'రాధేశ్యామ్' మొదలుకుని 'సలార్, ఆదిపురుష్' లాంటి ప్రతి చిత్రమూ పాన్ ఇండియా చిత్రమే, అయితే ఒక సినిమా...

మనం నిత్యం వాడే ‘వీటి’ వల్ల కలిగే ఉపయోగాలు !

ఆరోగ్యమే మహాభాగ్యం...ఏం ఉన్నా లేకపోయినా, జీవితానికి అదొక్కటి ఉంటే చాలు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాల గురించి తెలుసుకోవటం అవసరం. నిత్యం మనం ఉపయోగించే వాటిలో కొన్నింటి వల్ల కలిగే మేలు గురించి తెలుసుకుందాం. పసుపు: రక్త శుద్ధి...

చిరంజీవి అనుకున్నది …చరణ్ చేస్తున్నాడు

ఇండియాలోని మేటి దర్శకులలో శంకర్ ఒకరు. సమకాలీన సామాజిక సమస్యల మీద ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంటారు. భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలతో తన...

Latest News