రామ్ మాధవ్ వ్యాఖ్యలపై వైసీపీ, టీడీపీ ఎవరికి వారే.. బీజేపీ స్టాండ్ క్లియర్‌గా ఉందా?

BJP Stands Clear With Ram Madhav Comments

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేత రామ్ మాధవ్ నిన్న రాజధానిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారని, రాజధాని ఇక్కడే ఉండాలని ఏపీ బీజేపీ నేతలు కూడా పదేపదే చెప్పారని, కానీ ఇప్పుడు మూడు రాజధానుల అంశంపై చేతులెత్తేస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. నిన్న రామ్ మాధవ్ అందుకు భిన్నంగా మాట్లాడి, ఓ విధంగా టీడీపీ నేతల నోళ్లు మూయించారు! అసలు ఏపీకి మూడు రాజధానులు ఎందుకని, దేశంలో ఎక్కడా ఇలా లేదని తేల్చి చెప్పారు. ఉత్తర ప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలోనే ఒకే రాజధాని ఉందని గుర్తు చేశారు. మూడు రాజధానులు అనేవి మూడింతల అవినీతికి సాధానం కావొద్దని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ ఎవరికి వారు అన్వయించుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి తోడు దొరికింది

మొన్నటి వరకు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని చెప్పిందని, దీంతో నిలదీయాల్సి వచ్చిందని, కానీ మూడు రాజధానులు ఎందుకు అని రామ్ మాధవ్ ఏపీకి వచ్చి మరీ ప్రశ్నించారని, దేశంలో ఎక్కడా కూడా అలా లేదని గుర్తు చేశారని చెబుతూ తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వైసీపీపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ మాధవ్ వ్యాఖ్యలు తమ పోరాటానికి సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

TDP Got Friend

మూడు రాజధానుల అంశంపై తాము ఒంటరి కాదని తెలుగు తమ్ముళ్లు నిర్ధారణకు రావడానికి కారణమైంది. మూడు రాజధానులను బీజేపీ ప్రశ్నిస్తే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దూకుడుగా ముందుకు సాగుతారు. అయితే క్రెడిట్ మాత్రం ముందునుండి పోరాడిన తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశాలు ఎక్కువ. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో తెలుగుదేశం, వైసీపీలే కీలకం.

అదే చెప్పారని వైసీపీ

రామ్ మాధవ్ వ్యాఖ్యలను వైసీపీ కూడా తమకు అనుకూలంగా అన్వయించుకున్నాయి. మూడు రాజధానులు అనేవి మూడింతల అవినీతికి సాధానం కావొద్దని హెచ్చరించారని, అంటే ఈ నిర్ణయం గత ప్రభుత్వం అమరావతి పేరుతో చేసిన అవినీతిలా ఉండవద్దని మాత్రమే చెప్పారని వైసీపీ కేడర్ చెవులు భావిస్తోంది.అంతేకాదు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని, అలాగే ప్రస్తుత మూడు రాజధానుల అంశంపై పరిమితంగానే చొరవ ఉంటుందని సదరు బీజేపీ నేత చెప్పారు.ఇది కేంద్రం పరిధిలోనిది కాదని ఇప్పటి వరకు బీజేపీ చెప్పిందని, ఇప్పుడు రామ్ మాధవ్ కూడా ఓ వైపు మూడు రాజధానులను ప్రశ్నిస్తూనే.. తమ పరిధిలో అంతగా లేదని చెప్పకనే చెప్పారని కూడా అంటున్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న పోరాటంలో బీజేపీ ముందుండాలని సూచించారని, వైసీపీ కూడా రైతులకు న్యాయం చేసేందుకు సిద్దంగా ఉందంటున్నారు.

 BJP Stands Clear With Ram Madhav Comments

2024లో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని, ప్రతిపక్ష స్థానం ఖాళీ ఉందని, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే తెలంగాణలో ఉన్న బలం కూడా ఏపీలో బీజేపీకి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని చెబుతూనే, 2024లో సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా కృషి చేయాలని పార్టీ కేడర్‌కు సూచించారు.

బీజేపీ స్టాండ్ ఏమిటి?

రాజధాని విషయంలో రామ్ మాధవ్ వ్యాఖ్యలను అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ ఎవరికి వారు తమకు తాము అన్వయించుకున్నప్పటికీ బీజేపీ మాత్రం క్లియర్‌గానే ఉన్నట్లుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మూడు రాజధానుల విషయంలో ఉద్యమ పంథా కొనసాగించాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, యూపీ వంటి రాష్ట్రానికే ఒక్క రాజధాని ఉందని రామ్ మాధవ్ స్పష్టంగా చెప్పారు.

 BJP Stands Clear With Ram Madhav Comments

అదే సమయంలో కేంద్రం పాత్ర ఈ విషయంలో పరిమితం అన్నారు.అంటే అమరావతి కోసం ఏపీ బీజేపీ పోరాటం చేసేందుకు పచ్చ జెండా ఊపారు. బంతి మాత్రం వైసీపీ కోర్టులోనే ఉన్నదని రామ్ మాధవ్ వ్యాఖ్యల్లో తేలిపోయిందని అంటున్నారు.