యవ్వన మిసమిసల్లో ఊళ్లోని యువతను సర్వనాశనం చేసి, శరీరాలను రోగగ్రస్తం గావించి, అవయవ పొంకం ఆసాంతం నేలవైపు జారాక, తోలుతిత్తిగా మిగిలిన తన దేహాన్ని ఏ విటుడూ కన్నెత్తి చూడక, ఆదాయం పడిపోయిన వారవనిత ఆవేశం, ఆక్రోశం ఈవారం తన రక్తవాంతుల రూపంలో మరోసారి డోక్కున్నాడు పాత్రికేయభ్రష్టుడు రాధాకృష్ణ! జీవితాంతం చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడని, ఆయన తరువాత ఆయన ఉత్తరకుమారుడు, పరమశుంఠ బిరుదాంకితుడు లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని, తన దోపిడీకి అడ్డే ఉండదని ఎన్నెన్నో కలలు కన్నాడు. కానీ, ఆయన దురదృష్టమో, ఆంధ్రుల అదృష్టమో….అయిదేళ్ల పాలనకే చంద్రబాబును అసహైహించుకుని ఆయన్ను, ఆయన పుత్రరత్నాన్ని బంగాళాఖాతంలోకి విసిరేశారు ప్రజలు. భూరి ధనరాసులిచ్చి కన్నెరికం చేసిన జమీందారు బిడ్డను నుతించినట్లు చంద్రబాబును అనవరతము స్తోత్రాలతో భజించి, కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేయడం మరిగిన రాధాకృష్ణకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినతరువాత తన వేశ్యావాటికను మూసుకోవాల్చి వచ్చింది. నయాపైసా ఆదాయం లేక, రోగాలతో కుళ్లిపోయిన దేహానికి వైద్యం చేయించుకునే సత్తా లేక రోడ్డుపక్కన చచ్చిన వెలయాలులా విలవిలలాడిపోతున్నారు. మనం అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ఎంతగా విమర్శించినా, ఆక్షేపించినా, సిగ్గూఎగ్గూ గడ్డిపోచ మాత్రం కూడా లేని రాధాకృష్ణ “సిగ్గు పడాలి” అనే సిగ్గులేని మకుటంతో సిగ్గువదలి ఉన్నతాధికారుల మీద విరుచుకుని పడ్డాడు.
“ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో లీలామాత్రంగా ఊహించాం గానీ.. మొత్తం వైసీపీ నాయకులంతా రౌడీలుగా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని బీజేపీకి చెందిన ఒక ముఖ్యుడు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.”
ఓహోహో…ఎవరబ్బా ఆ బీజేపీ ముఖ్యుడు? బహుశా కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు….వైసిపిలో చేరబోయి చివరి క్షణంలో బీజేపీలో చేరాల్సి వచ్చినందుకు వలవల ఏడుస్తుంటాడు ఆయన! బీజేపీలో చేరి తమ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్న నాయకులు రాష్ట్రంలో ఇద్దరు. ఒకరు పురందేశ్వరి. మరొకరు కన్నా లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో రౌడీతనానికి విత్తనాలు వేసిందే తెలుగుదేశం పార్టీ అని గత నలభై ఏళ్ల చరిత్రను గమనించినవారందరికీ తెలుసు. తెలుగుదేశం గూండాలు అని తెలుగుదేశం నాయకులను ముద్దుగా పిలుస్తారని తెలియనిదెవరికి తెలుగు రాష్ట్రాల్లో?
****
“నిజానికి బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోంది.”
ప్చ్..ప్చ్….ఆరాచకపాలన అంటే రాధాకృష్ణకు తెలిసిన అర్ధం ఏమిటో మనకు తెలియదు కానీ, విశ్వవిద్యాలయంలో విద్యార్థినిని మానభంగం చేసి మర్డర్ చెయ్యడం, చిత్తూర్ మేయర్ దంపతులను ఆఫీసులోనే అడ్డంగా నరికెయ్యడం, కర్నూల్లో చెరుకువాడ నారాయణరెడ్డి అనే వైసిపి నాయకుడిని వేటకొడవళ్లతో హతమార్చడం, మాచర్లలో ఎన్నారై నాయకురాలిని పాశవికంగా చంపెయ్యడం, నాటి ప్రతిపక్షనేతకు విమానాశ్రయంలోనే హత్య చెయ్యాలని విఫలప్రయత్నం చెయ్యడం, స్మగ్లర్ల పేరుతో తమిళనాడు కూలీలను కాల్చిపారెయ్యడం, పుష్కరాల పేరుతో ముప్ఫయి మంది భక్తులకు మోక్షం ప్రసాదించడం, ఆలయాలు కూల్చేయడం, తిరుపతి వెంకన్న నగలను దోచేయడం. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం, గ్రాఫిక్స్ తో అయిదేళ్లపాటు ప్రజల చెవుల్లో కాబేజీలు పెట్టడం…..ఇవన్నీ రాధాకృష్ణ దృష్టిలో ఆదర్శవంతమైన పాలన కాబోలు! ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఏవో రెండు దుస్సంఘటలను చూపిస్తూ ఆరాచకపాలన రాజ్యం ఏలుతోందని రాధాకృష్ణ వాపోతుంటే దేనితో నవ్వాలో?
****
“రాజకీయ పార్టీలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు శాంతిభద్రతలను కాపాడటం, పౌరులకు రక్షణ కల్పించడం పోలీసుల విధి కాదా? రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన జగన్ అండ్ కోకు పోలీసులు దాసోహం కావడం సబబేనా? రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారి అరాచకం పెచ్చరిల్లితే ఏమి జరుగుతుందో తెలియదా? హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. రూల్ ఆఫ్ లాను అమలుచేయవలసిన బాధ్యత పోలీసులది కాదా?”
ఎంత అమాయకుడివి రాధాకృష్ణా?? నో..నో… ప్రజలను ఎంత అమాయకులుగా భావిస్తున్నావో కదా! శాంతిభద్రతలకు విఘాతం కలిగేది రాజకీయపార్టీలు అదుపు తప్పినప్పుడేనా? మిగిలిన సందర్భాల్లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా? నాడు జగన్ మీద విమానాశ్రయంలోనే హత్యాయత్నం జరిగినపుడు పరిగెత్తుకుంటూ వచ్చి విచారణ చెయ్యాల్సిన నాటి డీజీపీ ఠాకూర్ మహాశయుడు కనీసం తన బాధ్యతను నిర్వర్తించాడా? పైగా అరగంట కూడా గడవకముందే ఆ హత్యాయత్నం చేసినవాడు జగన్ అభిమాని ని, జగన్ శ్రేయస్సు కోరే హత్యాయత్నం చేసాడని పిచ్చికూతలు కుయ్యలేదా? పైగా మడతలు నలగని పదకొండు పేజీల లేఖను సృష్టించి ఆ ఘాతుకాన్ని పల్చబరచాలని ప్రయత్నించలేదా? కాంటీన్ యజమాని తెలుగుదేశం నాయకుడని తెలియడంతో కనీసం అతడిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అలాంటి పోలీసులను ఎవరు నమ్ముతారు? రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం ఉంటే, ఈరోజు చంద్రబాబు పోలీసులను ఎందుకు బెదిరిస్తున్నాడు? వారి అంతు చూస్తానని ఎందుకు హెచ్చరిస్తున్నాడు?
***
“ఎన్‌టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి రౌడీల ఆట కట్టించారు. విజయవాడలో కూడా ఒకప్పుడు ఇలాంటి రౌడీయిజమే సాగింది. రౌడీలు రాజ్యమేలితే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుందా? డీజీపీ సవాంగ్ మరో మూడేళ్లపాటు ఆ పదవిలో ఉండవచ్చు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో స్థిరపడిపోతారు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు. నేను ఇక్కడ ఉండబోవడం లేదు కదా? ఆంధ్రప్రదేశ్ ఏమైతే నాకేంటి? నా పదవి నాకు ముఖ్యం అని ఆయన భావిస్తున్నారేమో తెలియదు!”
అహో…ఏమి నంగనాచి తుంగబుర్ర కబుర్లు! ఎన్టీఆర్ రౌడీల ఆట కట్టించాడట….అందుకేనా రిక్షాలో ఇంటికి వెళ్తున్న ఎంకౌంటర్ పత్రిక సంపాదకుడు పింగళి దశరధరామ్ ను నడిరోడ్డు మీద నరికి చంపేశారు? అందుకేనా షామియానాలో కూర్చుని నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగాను అర్ధరాత్రి విచ్చుకత్తులతో క్రూరాతిక్రూరంగా హత్యచేశారు! కారంచేడులో దళితులను వెంటాడి కొడవళ్ళతో, గొడ్డళ్లతో కూరలను తరిగినట్లు తరిగేశారు? ఇక పదవీవిరమణ తరువాత గౌతమ్ సవాంగ్ హైదరాబాద్లో స్థిరపడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏమైపోతే తనకేమిటి అనుకుంటున్నారు అని ఆయన మీద తుచ్ఛమైన ఆరోపణ చేస్తున్నారు. మరి చంద్రబాబు? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ తన పాలెస్ ను ఎక్కడ నిర్మించుకున్నారు? ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన నివాసాన్ని హైద్రాబాద్ లో ఎందుకు నిర్మించుకున్నారు? ఎన్నికల్లో ఓడిపోతే వెళ్లి తెలంగాణాలో స్థిరపడదామనా లేక అద్దెకు ఇచ్చుకుందామనా? సివిల్ సర్వీస్ అధికారులు దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి ఉంటారు. పదవీవిరమణ తరువాత వారు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం సహజం. హైకోర్టు, సుప్రీమ్ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులు పదవీవిరమణ చెయ్యగానే తమ స్వస్థలాలకు వెళ్ళిపోతారు కాబట్టి అడ్డదిడ్డంగా తీర్పులు ఇస్తారా?
***
“ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అంతరాత్మ ఉండదా? మీరు జీతాలు, ఇతరత్రా సౌకర్యాలు పొందుతున్నది ప్రజల సొమ్ముతోనే కదా? ముఖ్యమంత్రులు తమ జేబులో నుంచి ఇవ్వడం లేదు కదా? ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది అధికారుల ప్రవర్తన ఉన్న కారణంగానే హైకోర్టుకు పనిభారం పెరిగింది. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో బాధితులకు ఉపశమనం కలిగించే ఏకైక వ్యవస్థగా ఉన్నత న్యాయస్థానం నిలబడింది.”
అడ్డెడ్డెడ్డే….పాపం..ఆ అధికారులను రెచ్చగొట్టడానికి ఎంతగా శ్రమిస్తున్నాడో రాధాకృష్ణ! ఉన్నతాధికారుల అంతరాత్మలను ఏనాడో చంపేశారు మన రాజకీయనాయకులు. నిజంగా ఆ అధికారులకు అంతరాత్మ అనేది ఉన్నట్లయితే, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన కాలర్ పట్టుకున్న కేశినేని నాని చెంప పగలగొట్టి, చేతులకు సంకెళ్లు వేసి జైల్లో వేసి బొక్కలు విరగగొట్టేవారు నాటి రవాణాశాఖ కమీషనర్! అలా చెయ్యకుండా చేతులెత్తి చదువుసంధ్య లేని ఒక చవటకు రెండు చేతులెత్తి ఎందుకు దణ్ణం పెట్టాడు? తనను దుశ్శాసనుడిలా జుట్టుపట్టి లాగి చితకకొట్టిన ఒక రౌడీ ఎమ్మెల్యేను జ్యూడిషియల్ పవర్స్ ఉపయోగించి అరెస్ట్ చెయ్యకుండా, ఏడుస్తూ వెళ్ళిపోయింది దేనికి ఆ తాసిల్దార్? అధికారులను బానిసల్లాగా వాడుకోవడం రాష్ట్ర చరిత్రలో ఒక్క చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య.
***
“రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు సగం మొత్తాన్ని జీతభత్యాల కింద పొందుతున్న వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో కనీసం పిడికెడు మందికి కూడా ఆత్మసాక్షి లేదా? అధికార పార్టీ మెప్పు కోసం అడ్డమైన పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?”
హ్హాహ్హాహ్హా…నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని రాధాకృష్ణ బరితెగింపుకు ఈ వాక్యాలు పరాకాష్ట. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రభుత్వ నేతల ఆదేశాలను పాటించి తీరాల్సిందే… అవి మంచి కానీ, చెడు కానీ…మేము పాటించము అని ఎదురు తిరిగితే ఉద్యోగాలు వదులుకుని పోవాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదు. రాజకీయనాయకులు చేసే తప్పులకు శిక్షలు వారే అనుభవిస్తారు తప్ప అధికారులు కారు. ఇది ప్రజాస్వామ్యం రాధాకృష్ణా…నీకింద పనిచేసే విలేకరులు నీ పాలసీలను అనుసరించాల్సిందే తప్ప నిన్ను తప్పు పడితే నువ్వు సహిస్తావా? నీ కింద పనిచేసే ఉద్యోగులకు అంతరాత్మ అనేది ఉంటే, నీ ఆఫీసులో ఒక్కడు కూడా పనిచేసేవాడు కాదు.
***
“రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆయనతోపాటు మరో ఇద్దరు ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్రం చూస్తూ ఊరుకోదనీ, కఠిన చర్యలు తీసుకుంటుందనీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ సెగ తమకు కూడా తగలడంతో ఆయన ఇలా స్పందించి ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి ఇప్పుడు ఆయనకు గుర్తుకురాలేదేమో?”
పాపం జీవీఎల్ సంగతేమిటో కానీ, రాధాకృష్ణ మాత్రం కేంద్రం జోక్యం చేసుకుని తక్షణమే జగన్ ను పదవినుంచి పీకేయాలని స్వైరకల్పనల్లో తేలాడుతున్నాడు రాధాకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వాలు అపరిమిత అధికారాలు కలిగి ఉంటాయని, రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగం అనుమతించదని సీనియర్ పాత్రికేయుడు రాధాకృష్ణకు తెలియదేమో మనకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పాలించినా, జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి మన రాజ్యాంగం అధికారం ఇవ్వలేదని ఆయనకు తెలియకపోవచ్చు. కేంద్రానికే ఆ అధికారం ఉంటే మన దేశంలోని తొంభైశాతం రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం కర్కశహస్తాల్లో నలిగిపోయేవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలను శిక్షించే అధికారం ఒక్క ప్రజలకు మాత్రమే ఉంటుంది. అంతే తప్ప కేంద్రానికి లేనేలేదని రాధాకృష్ణకు, కన్నా లక్ష్మీనారాయణకు తెలియకపోవచ్చేమో కానీ, జివిఎల్ కు తెలియదని నేను అనుకోను…
**
పాపం అత్యంత అవినీతిమయం, దోపిడీ పాలనను ఇన్నాళ్లూ కులగజ్జితో సహించిన పచ్చ మీడియాకు ఎవరికీ తలవంచకుండా, అభివృద్ధిపధంలో, సంక్షేమపథంలో దూసుకుని పోతున్న జగన్ ప్రభుత్వం నిర్ణయాలు ఏమాత్రం జీర్ణం కావడంలేదు. దానికితోడు తనకు భారీ ముడుపులు రావడంలేదు. దాంతో రాధాకృష్ణ బాధ ప్రపంచం బాధ అయింది! సానుభూతి చూపించి అశ్రుతర్పణం విడుద్దాం!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు