100 ఏళ్ల తర్వాత శ్రావణంలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు కనక వర్షమే..!

ఈసారి శ్రావణమాసం విశేషమైనదిగా నిలవబోతోంది. ఎందుకంటే శతాబ్ద కాలం తర్వాత కొన్ని కీలక గ్రహాలు ఒకే రాశిలో కలిసే అవకాశముంది. జ్యోతిష్య నిపుణుల మాటల ప్రకారం, ఈసారి మిథున రాశిలో చంద్రుడు మరియు బృహస్పతి కలిసి గజకేసరి రాజయోగాన్ని రూపొందిస్తున్నాయి. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యోగం వల్ల ఏ రాశులకు లాభమో ఈ కథనంలో తెలుసుకుందాం.

వృషభ రాశి: వృషభరాశి వారికి ఈ సమయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయంట. ఆత్మవిశ్వాసం పెరిగి, పని తీరు దురుసుగా కాకుండా సమర్థంగా ఉంటుందంట. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ మంచి అభివృద్ధి కనబడుతుందని పండితులు చెబుతున్నారు. నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయని.. సమాజంలో గౌరవం, గుర్తింపు కూడా పెరుగుతాయని అంటున్నారు.

మిథున రాశి: గజకేసరి రాజయోగం ప్రధానంగా మిథున రాశిలో ఏర్పడుతున్నందున వీరికి ఎంతో లాభకరంగా మారుతుంది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగం ఉన్నవారికి పదోన్నతులు, పదవి మార్పులు కూడా కలసి వస్తాయి. ఆస్తి లావాదేవీల్లో లాభాలు అధికంగా దక్కుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు, దాంపత్య జీవితం మరింత బలపడుతుంది.

సింహ రాశి: సింహరాశి వారికి ఈ గజకేసరి యోగం ఆర్థికంగా కొత్త అవకాశాలను తెరుస్తుంది. పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తొలగి సఖ్యత పెరుగుతుంది. ప్రేమలో కొత్త మాధుర్యం తళుక్కు మంటుంది. ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది.

తులా రాశి: తులారాశి వారు ఈ కాలంలో తమ ప్రతిభను సత్తా చాటగలుగుతారు. ముఖ్యంగా మాట్లాడే నైపుణ్యం మెరుగై కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో కొత్త ఆరంభాలకు ఇది చక్కటి సమయం. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు సరిచేయబడతాయి.

గజకేసరి రాజయోగం సాధారణంగా ప్రతికూలతలను తొలగించి.. సానుకూలతను జీవితంలోకి తేగలదు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. వందేళ్లకు ఒక్కసారే వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సన్నద్ధం కావడం శ్రేయస్కరం అని పండితులు సూచిస్తున్నారు.