దివంగత కల్నల్ సతీమణికి సముచిత గౌరవం

భారత చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన దివంగ‌త క‌ల్నల్ సంతోష్ బాబు స‌తీమణి సంతోషికి అరుదైన గౌరవం దక్కింది. దేశ సరిహద్దుల్లో భర్త వీరమరణం పొందగా… యాద్రాద్రి ఆలయం ఉన్న యాద్రాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్ గా నియాకం అయ్యారు సంతోషి. దీంతో ఆలయ నిర్మాణానికి తన వంతు సేవ చేసే అరుదైన అవకాశం దక్కిందని ఆమె అన్నారు. ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో తనకు యాద్రాద్రి పోస్టింగ్ రావడం… అదీ మొదటి పోస్టింగ్ కావడం నిజంగా తన పూర్వ జన్మసుకృతమని అన్నారు.

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా యాద్రాద్రి ఆలయ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్మాణాలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆఘమేఘాల మీద భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసిన విధంగానే యాద్రాద్రిని వీలైనంత త్వరగా కట్టాలని కేసీఆర్ భావించినప్పటికీ… వేగం కన్నా శాస్త్రం మిన్న అన్న చినజీయర్ స్వామి సూచనల మేరకు… ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఆచితూచి నిర్మాణ పనులు చేపడుతున్నారు. తరచు యాద్రాద్రి వెళ్లి మరీ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు సీఎం కేసీఆర్.

ల‌ఢ‌క్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భారత్‌, చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన గోడ‌వ‌లో సూర్యాపేటకు చేందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ బాబు సేవలను గుర్తిస్తూ… సీఎం కేసీఆర్ ఆయన భార్య సంతోషికి గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు కేబీఆర్ పార్క వద్ద ఇంటి స్థలం, 5 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
ఇందులో నాలుగు కోట్లు కల్నల్ సంతోష్ బాబు పిల్లల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసిన కేసీఆర్… మిగతా కోటి రూపాయలను ఆయన తల్లిదండ్రుల ఖాతాలో జమ చేశారు.
అప్పట్లో కేసీఆర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న సంతోషి … ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకొని యాద్రాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్ గా నియామకం అయ్యారు.

భర్త స్పూర్తితో ఇకపై తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తానని ట్రైనీ కలెక్టర్ సంతోషి అన్నారు.

బిక్కుమళ్ళ సంతోష్ బాబు
1982లో జన్మించిన ఈయన… సైన్యంలో చేరి 16 బీహార్ రెజిమెంట్ కు కమాండింగ్ అధికారిగా కొనసాగుతూ వీరమరణం చెందారు. 1967 తర్వాత చైనాతో జరిగిన సరిహద్దు వివాదాల్లో వీరమరణం పొందిన మొదటి అధికారి ఈయనే.

సూర్యపేట వాస్తవ్యుడు అయిన సంతోష్ బాబు ఉపేంద్ర, మంజుల ఏకైక కుమారుడు. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్ పేటలోని సరస్వతి శిశుమందిర్ లో ఐదవ తరగతి వరకు చదువుకున్న ఈయన… అక్కడ రగిలిన స్పూర్తితో విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కుల్ లో చేరి విద్యను అభ్యసించారు. ఆతర్వాత సైన్యంలో చేరారు. సైన్యంలోని ఈయన సహచరులు సంతోష్ బాబును. “సానుభూతిపరుడు, ఇంకా ధైర్యవంతుడు” అని అభివర్ణించారు.

సర్వీస్ రికార్డ్….
సర్వీసులో ఈయన్ని స్పెషల్ సర్వీసు మెడల్, సైన్య సేవా మెడల్, హై ఆటిట్యూడ్ సర్వీసు మెడల్, విదేశ్ సేవా మెడల్, 9 సంవత్సరాల లాంగ్ సర్వీసు మెడల్ తో పాటు యు.ఎన్.మిషన్ ఇన్ కాంగో మెడల్ వరించింది.