అవునూ.! మంత్రిగారు ఎందుకు చొక్కా విప్పినట్లు.? మీడియా విస్తుబోయేలా చేసిందెందుకు.? ఏం సాధించారు చొక్కా విప్పడం ద్వారా.? మంత్రిగారి హీరోయిజం ఎలివేట్ అయ్యిందా.? లేదా.? ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ప్లస్ అయ్యిందా.?
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షో సందర్భంగా టీడీపీ – వైసీపీ శ్రేణుల మధ్య రచ్చ జరిగింది. సాధారణంగా అయితే, ప్రతిపక్ష నేత కార్యక్రమాలకు అధికార పార్టీ దూరంగా వుండాలి. అధికార పార్టీ అధికార కార్యక్రమాల్లో విపక్షాలు నిరసన తెలపడం అనేది సర్వసాధారణం.
కానీ, ఇక్కడ సీన్ మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో వున్నారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నట్టున్నాయి. ఆయనకు నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. కాదు కాదు, స్థానిక వైసీపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం.. వైసీపీ కొంప ముంచుతోంది.
కింది స్థాయి కార్యకర్తలు తొందరపడితే, వారిని పై స్థాయి నాయకులు వారించాలి. మంత్రులుగా వున్నవారు ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. కానీ, కార్యకర్తలకు అండగా.. అన్న కోణంలో, మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డెక్కారు.. చొక్కా తీసేసి ‘కాల్చేస్తారా.? కాల్చెయ్యండి’ అంటూ లేనిపోని హడావిడి చేశారు.
వైసీపీ అధినాయకత్వమే ఈ వ్యవహారంపై ఆశ్చర్యపోయిందట. వైసీపీ ఇంతలా ఫ్రస్టేట్ అవుతోంటే, చంద్రబాబుకి ఆనందమే కదా అది.?