భార‌త‌దేశానికి అల్‌ఖైదా ఐసిస్ ఉగ్ర‌దాడుల ముప్పు

ఒసామా బిన్ లాడెన్ త‌ర్వాత ఒసామా మ‌హ‌మూద్ బ‌రిలోకి!!

ఓ వైపు క‌రోనా.. మ‌రోవైపు ఉగ్ర‌వాదం భార‌త‌దేశానికి పెను సవాల్ గా మారుతున్నాయి. దేశంలో విధ్వంశాల‌కు భారీగా ఉగ్ర కుట్ర‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్న‌ది తాజా రిపోర్ట్. ఐసిస్ స‌హా అల్ ఖైదా ప్ర‌జా స‌మూహాల్లో దారుణాల‌కు ఒడిక‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయన్న స‌మాచారం రివీలైంది. కేరళ, కర్ణాటకలో భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు దాక్కున్నారని యుఎన్ (యునైటెడ్ నేష‌న్స్) నివేదిక పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపుతోంది. భారత ఉపఖండంలో అల్-ఖైదాకు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , మయన్మార్ లో న‌మ్మిన ఏజెంట్లు ఉన్నారు. దాదాపు 150 నుండి 200 మంది ఉగ్రవాదులు ఆయా దేశాల్లో ఉన్నారని, ఈ ప్రాంతంలో దాడులు చేయాలని యోచిస్తున్నార‌ని యుఎన్ తెలిపింది.

Read More : టాలీవుడ్ సెల‌బ్రిటిల్నీ డైవ‌ర్ట్ చేస్తున్నారా?

భారత ఉపఖండంలోని అల్-ఖైదా తీవ్ర‌వాద సంస్థ‌ ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రూజ్, హెల్మండ్ & కాందహార్ ప్రావిన్సుల నుండి తాలిబాన్ గొడుగు కింద పనిచేస్తుందని తాజా నివేదిక పేర్కొంది. స‌ద‌రు ఉగ్ర‌వాద బృందం తన మాజీ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దాడిని ప్లాన్ చేస్తోందన్న‌ది నివేదిక సారాంశం.

Read More : మ‌రో ఎటాక్‌: PUBG స‌హా 275 చైనా యాప్‌ల నిషేధం

తీవ్ర‌వాద‌ బృందంలో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, పాకిస్తాన్ నుండి 150 నుండి 200 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత అల్ ఖైదా (AQIS) నాయకుడు ఒసామా మహమూద్, దివంగత అసిమ్ ఉమర్ తరువాత వచ్చారు. AQIS మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో ప్రతీకార చర్యలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read More : జగన్ హర్టయ్యారు కాబట్టే కన్నాను పీకేశారట.. అంతా అనుకుంటున్నారు

అంతేకాకుండా, 2019 మే 10న ప్రకటించిన ఐసిఎల్ ఇండియన్ అనుబంధ సంస్థ (హింద్ విలాయా) లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారని, దానిలో ఎక్కువ భాగం కేరళ – కర్ణాటక నుండి పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఐసిస్, అల్-ఖైదా అనుబంధ వ్యక్తులు, వారి సంస్థలకు సంబంధించిన వివ‌రాల్ని విశ్లేషించే గూఢ‌చార‌ ప‌ర్య‌వేక్షణ బృందం ఈ వివ‌రాల్ని వెల్ల‌డించాయి.

Read More : సిక్కోలు సింహం కోసం దిగొచ్చిన‌ రామ్మోహ‌న్ నాయుడు!

తాజా ప‌రిణామాలు చూస్తుంటే.. ఏ క్ష‌ణం అయినా ఇండియాకి తీవ్ర‌వాదుల ముప్పు పొంచి ఉంద‌న్న‌ది ఈ నివేదిక సారాంశం. ఇదొక్క‌టే కాదు.. ఇంత‌కుముందు ఐసిస్ నుంచి ఉగ్ర ముప్పుపైనా ప‌లు క‌థ‌నాలు హీట్ పెంచాయి. ఐసిస్ తీవ్ర‌వాదులు భార‌త‌దేశంలో క‌రోనా వ్యాప్తికి అత్యంత ఘోర‌మైన కుట్ర‌లు ప‌న్నార‌ని స‌మాచారం అందింది.

-శివాజీ.కె