(చెత్త) పలుకులు పంచదార…నిలువెల్లా విషపుధార!!! 

YS Jagan and ABN Radha Krishna
తాత్కాలికంగా అయినా సరే…జగన్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాము అన్న అల్ప సంతోషం రాధాకృష్ణ మోహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.  కానీ, ఆ విన్యాసాలవలన నష్టం ఎవరికి లభిస్తున్నదో గుర్తించలేక, తన యజమానికి ఏమైనా లబ్ది చేకూరుతుందేమో అన్న ఆశ చావక “దొంగకు భయం, వేశ్యకు సిగ్గు పనికిరావు” అని పెద్దలు చెప్పినట్లు ప్రజలు ఎంతగా ఛీకొడుతున్నా దులపరించుకునిపోతూ వారం వారం చేస్తున్న శివతాండవాలలో భాగంగా ఈ వారం “ఏది లీగల్..ఎవరు లిటిగెంట్” అంటూ కొన్ని అవాకులు చవాకులు ప్రేలాడు.  మెచ్చుకుని కొన్ని చర్చించుకుందాం.  
 
YS Jagan and ABN Radha Krishna
 
***
 

హైదరాబాద్‌ వంటి మహానగరంలోనే లేక్‌ వ్యూ వంటి అతిథిగృహం ఐదు ఎకరాలలో ఉండగా విశాఖలో 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించాలనుకోవడం ఏమిటి?   హైదరాబాద్‌ సమీపంలో దాదాపు 20 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నెలకొల్పే పనులను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అభివృద్ధి అంటే అటువంటి ఆలోచనలు చేయాలి గానీ, ప్యాలెస్‌లను తలపించే ఇళ్లు నిర్మించుకోవడం, ఏకంగా 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించుకోవడం కాదు”

 
ఓహో…హైదరాబాద్‌ లో అయిదు ఎకరాల్లో లేక్ వ్యూ అతిధి గృహం ఉంటే ఇక దేశం మొత్తానికి ఆ కొలతలే ప్రామాణికం అన్నమాట!   అంతకన్నా తక్కువ ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు అన్నమాట!  మరి అంత మహానగరం అనిపించుకున్న హైదరాబాద్‌ వైశ్యాల్యం ఎంత?  చంద్రబాబు తలపెట్టిన అమరావతి వైశ్యాల్యం ఎంత?  ఎప్పుడో ఒకసారి ఎవరో కేంద్రప్రభుత్వ మరియు ఇతర అధికారులు ఒకటి రెండు రోజులు బస చేసే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస చేసే గెస్ట్ హౌస్ కు తేడా లేదా?  అక్కడ ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయం ఉంటుంది.  రోజూ వేలాదిమంది రాష్ట్రం నలుమూలలనుంచి పనుల నిమిత్తం వస్తారు.  డజన్లకొద్దీ ఉన్నతాధికారులు ఉంటారు.  సాధారణ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం నాలుగైదువేల చదరపు గజాల స్థలాల్లో నివాసగృహాలు కట్టుకుంటున్నారు.  మరి ఒక ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ ముప్ఫయి ఎకరాల్లో ఉంటే అది పెద్ద నేరం అన్నట్లు రాధాకృష్ణ అమాయకత్వాన్ని నటిస్తున్నాడు.   ఇంకా నయం..  మహా నగరమైన హైద్రాబాద్ లోనే సముద్రం లేదు కాబట్టి విశాఖ లో మాత్రం  సముద్రం దేనికి అని ప్రశ్నించలేదు!  ఇక హైద్రాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం అక్కడ ఆంధ్రప్రదేశ్లో లాంటి ప్రతిపక్షం లేదు.  నరహంతకులను, దోపిడీ దొంగలను జైళ్లలో పడేస్తే వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని కోర్టులకు ఎక్కే నీచమైన రాజకీయ పార్టీలు లేవు.  ఆ సంగతి రాధాకృష్ణకు తెలియదా పాపం!!
 
***
 

హైదరాబాద్‌‌లో ప్రైవేట్‌ పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్‌ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది. ఇంతవరకు అటువంటి ఆలోచన ఒక్కటైనా చేశారా? నిజమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఎవరినో నిందించి ప్రయోజనం ఏమిటి?”

 
భళా…భళా…బహు చక్కగా సెలవిచ్చారు!  హైదరాబాద్‌ కట్టాను, సైబరాబాద్ కట్టాను, మెట్రో తెచ్చాను, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాను… బేగంపేట్ కట్టాను..బ్రిటిష్ వారితో సమరం చేశాను అని రోజుకు పదిసార్లు స్వకుచమర్దనం చేసుకునే చంద్రబాబు అయిదేళ్ల కాలంలో ఏమి వెలగబెట్టారు?  అధికారులను, చెంచాలైన మంత్రులను, సలహాదారులను వెంటేసుకుని ప్రత్యేకవిమానాల్లో ప్రపంచ దేశాలన్నీ విలాసపర్యటనలు చేసి చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలు ఎక్కడ?  ప్రతి ఏడాది విశాఖపట్నంలో అస్మదీయుల హోటళ్లకు వ్యాపారం పెంచడం కోసం పారిశ్రామికసదస్సులు అంటూ డ్రామాలు ఆడి, నలభై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని క్షుద్రమీడియా తో ప్రచారం చేయించుకున్నారే…ఏవీ?  ఎక్కడ ఆ దేవాతావస్త్రాలు?  మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన ఒక చిన్న ఫ్లై ఓవర్ ను అయిదేళ్ల పాలనాకాలంలో నిర్మించడం చేతగాని చంద్రబాబు అసమర్ధతను ఏనాడైనా ప్రశ్నించాడా రాధాకృష్ణ ?    ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ వచ్చిందంటే అది కేవలం రాజశేఖరరెడ్డి కృషి మాత్రమే కారణం.  ఆ విషయాన్నీ ఆ కంపెనీయే స్వయంగా స్పష్టం చేసింది.  చంద్రబాబు ఐదేళ్లు అధికారం వెలగబెట్టి ఒక్క ప్రాజెక్టును, ఒక్క పరిశ్రమను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారా?  అసలు చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలోనే అలాంటి అద్భుతాలు సంభవించాయా?  
 
హైదరాబాద్‌ మహానగరం ఏ ఒక్కరోజులోనో, సంవత్సరంలోనో అభివృద్ధి చెందింది కాదు.  ఇప్పటికే అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.  లక్షలకోట్ల రూపాయల పెట్టుబడులతో గత ముప్ఫయి ఏళ్లుగా అనేక పరిశ్రమలు వచ్చాయి.  వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం, విదేశాలకు ఏమాత్రం తీసిపోని వైఎస్సార్ దార్శనికతకు చిహ్నంగా ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది…అలాంటి నగరానికి పరిశ్రమలు తీసుకుని రావడానికి కూడా ప్రభుత్వం ఇంకా ఆనేకవిధాలుగా కృషి చేస్తుంటే….చంద్రబాబు పచ్చని ప్రకృతిని విధ్వంసం చేసి, పచ్చని పొలాలను ఆక్రమించి నిర్మించ  తలపెట్టిన అమరావతిలో పెట్టుబడులు ఎలా వస్తాయి?  అయిదేళ్ళక్రితమే విశాఖను రాజధానిగా చేసి ఉంటే…ఈపాటికి వందలాది పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరి ఉండేవి!  చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్ని మరపించాలంటే జగన్ కు కనీసం ఇరవై ఏళ్ళు పడుతుంది!
 
****
 

”పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే అడ్డుపడుతున్నవారిని కమ్యూనిస్టులు కూడా నిలదీయకపోవడం ఏమిటి?” అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు ప్రశ్నిస్తున్నారు.”

 
అవును మరి!  పాపం సజ్జల రామకృష్ణారెడ్డి!  కమ్యూనిస్టులు కమ్మనిష్టులుగా మారి పాతికేళ్ళు దాటిందని, వారు చంద్రబాబు బాహుమూలల్లో మట్టినలిపి బాబు విసిరే ఎంగిలి బిస్కట్లు నములుతూ ఆయన పాదసేవలో తరించడం మొదలై రెండు దశాబ్దాలు దాటిపోయిందని,   నేటి కమ్యూనిస్టులు ఇంకా మోటూరి హనుమంతరావు, పుచ్చలపల్లి సుందరయ్య,  నల్లమల గిరిప్రసాద్సు, రవరం ప్రతాపరెడ్డి కాలం నాటి నిజమైన కమ్యూనిస్టులే  అనుకుంటున్నారు సజ్జల!  చంద్రబాబు కూర్చోమంటే కూర్చోవడం, నించోమంటే నించోవడం,  చంద్రబాబు తమ ముఖాన ఉమ్మేస్తే మహాప్రసాదంగా భావించి తుడుచుకుని నవ్వడం, చంద్రబాబు వెళ్లగొడితే నోళ్లు మూసుకుని వెళ్లిపోవడం, చంద్రబాబు మళ్ళీ రమ్మంటే పరిగెత్తుకుంటూ వెళ్లి చంద్రబాబు పాదాలమీద వాలిపోవడం లాంటి బానిసచేష్టలకు దిగజారి చాలా ఏళ్ళయిందని సజ్జలగారు గ్రహించలేదు రాధాకృష్ణ!  అందుకే ఆయన అంత అమాయకంగా కమ్మనిస్టులను ప్రశ్నిస్తున్నారు!  
 
****
 

“న్యాయవ్యవస్థను చంద్రబాబునాయుడు మేనేజ్‌ చేస్తున్నారన్నది జగన్‌ అండ్‌ కో ప్రధాన ఆరోపణ. హైకోర్టులో జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నందున ఇలాంటి ఆరోపణలను నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం లేకపోలేదు. జగన్‌ అండ్‌ కో కోరుకుంటున్నది కూడా ఇదే! అందుకే హేతుబద్ధత లేకపోయినా ఇటువంటి ఆరోపణలను పదే పదే చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను నిజంగా మేనేజ్‌ చేయవచ్చా? మెరిట్‌తో సంబంధం లేకుండా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వగలవా?”

 
చంద్రబాబు నాయుడు న్యాయస్థానాలను మేనేజ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ, కొందరు న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారని, ధనవంతులకు మాత్రమే వారు సత్వర న్యాయం అందిస్తారని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులే పదవీవిరమణ అనంతరం బహిరంగంగా వాపోయారు!  కేసుల ఎలాట్మెంట్ లో పక్షపాతం చూపిస్తున్నారని కొన్నేళ్ళక్రితం సాక్షాత్తూ పదవుల్లో ఉన్న న్యాయమూర్తులే మీడియా గొట్టాల ముందు వాపోయారు.  వారిలో మన తెలుగువాడు కూడా ఒకరున్నారు.  ఇక తలచుకుంటే ప్రధానమంత్రిని సైతం జైలులోకి నెట్టగలిగిన శక్తివంతులైన కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అయ్యాక తుచ్ఛమైన రాజ్యసభ సభ్యత్వం కోసం, గవర్నర్ పదవులకోసం, మరొక లాభదాయకమైన పదవులకోసం దిగజారిపోతున్న సంఘటనలు మన కళ్ళముందే కనపడుతున్నాయి. జగన్ మీద సిబిఐ విచారణకు ఆదేశించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన మరునాడే మానవహక్కుల కమీషన్ చైర్మన్ గా నియమించబడ్డాడు.  మరొకాయన ఒక సినిమా నటిని అనుభవించి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడని ఇప్పటికీ గుసగుసలు ముసిముసిగా షికార్లు కొడుతున్నాయి.  ఇక చంద్రబాబు అర్ధరాత్రి ఇచ్చిన విందుకు పందొమ్మిది మంది న్యాయమూర్తులు హాజరయ్యారు.  ఇవేవీ అబద్ధాలు కావే!  పవిత్రమైన పదవుల్లో ఉన్న న్యాయమూర్తులు తమ కట్టుబాటు తప్పినపుడు వారిమీద కూడా ఆరోపణలు రావడం సహజమే!    
 
***
 

జగన్‌ తనపై నమోదైన అవినీతి కేసులలో సత్వర విచారణ జరగకుండా చట్టంలో ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకున్నట్టుగానే ఇతరులు కూడా చేసి ఉండవచ్చు. మెరిట్‌తో సంబంధం లేకుండా తీర్పులు వెలువడినా వాటిని సమీక్షించడానికి పై కోర్టులు ఉన్నాయని తెలుసుకోవాలి. “

 
ఏమి చెప్పావు రాధాకృష్ణ!  తన మీద కేసులను త్వరగా విచారించమని జగన్ మోహన్ రెడ్డే కోర్టును కోరినట్లు ఒకప్పుడు వార్తలు వచ్చాయి.  సత్వర విచారణ జరగకుండా చట్టంలో ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకోవడం అనే కళలో చంద్రబాబు నాయుడు మాస్టర్స్ చేశాడని దేశం మొత్తం తెలిసిన రహస్యమే.  లేకపోతె…సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చెయ్యకుండా ఇరవై ఏళ్లుగా చంద్రబాబు మీద స్టేలు కొనసాగుతున్నాయంటే అది ఎవరి మహాత్మ్యం?   “చంద్రబాబును ఎక్కడైనా జయించవచ్చు కానీ, న్యాయస్థానాల్లో మాత్రం ఓడించలేము” అని ఒక న్యాయవాది నుడివిన కొటేషన్ జగత్ప్రసిద్ధం.  మర్చిపోతే ఎలా సామీ? 
 
****
 

” దీంతో చంద్రబాబు అండ్‌ కో ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అనే ట్రిక్‌ ప్రయోగించారని ప్రచారం చేశారు. ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అన్న ట్రిక్కు వల్ల తీర్పులను తారుమారు చేయవచ్చా? అంటే అసాధ్యమనే చెప్పవచ్చు! జగన్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ తొలుత సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే ముందు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును కొట్టివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. ఆ దశలో ఒక న్యాయవాది కల్పించుకొని ఈ కేసులో రైతుల తరఫున ప్రధాన న్యాయమూర్తి కుమార్తె హైకోర్టులో వాదించిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సంప్రదాయాలను అనుసరించి కేసు విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి తప్పుకొన్నారు. ఒకవేళ ఆయనే విచారించినా ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసి ఉండేవారు. జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని మరో బెంచ్‌ ముందుకు ఈ అప్పీల్‌ విచారణకు వచ్చినప్పుడు ఇలాంటి సాంకేతిక ఇబ్బంది ఎదురైంది. రైతుల తరఫున సీనియర్‌ నారిమన్‌ వాదిస్తున్నందున ఆయన కుమారుడైన న్యాయమూర్తి జస్టిస్‌ నారిమన్‌ తప్పుకొన్నారు”

 
అబ్బబ్బబ్బా…ఏమి తెలివిరా బాబూ!  జనం అమాయకత్వం మీద ఎంత నమ్మకమో కదా రాధాకృష్ణకు!  చంద్రబాబు నాయుడు ప్రయోగించిన “నాట్ బిఫోర్ మీ” అనే తంత్రం ఈనాటిదా?  ఆయన అవినీతి కేసులు బెంచ్ మీదకు వచ్చినపుడు ఈ ట్రిక్ ప్రయోగించే కదా విచారణను ఏళ్లతరబడి వాయిదా వేయించగలిగింది!  తమ కేసులు ఎవరి బెంచ్ ముందుకు వస్తాయో ముందుగానే తెలుసుకుని సదరు న్యాయమూర్తుల కుటుంబసభ్యులను న్యాయవాదులుగా నియమించుకుని కేసును విచారణ జరగకుండా అడ్డుకోవడం అనే ట్రిక్ ను మళ్ళీ మొన్న ప్రయోగించి సక్సెస్ అయ్యాడు చంద్రబాబు!  ఎవరిని నమ్మించడానికి ఈ నీచపుటెత్తుగడలు!  
 
***
 

“వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటూనే అభివృద్ధి చెందిన విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెట్టాలని అనుకోవడంలో కపటత్వం కనిపించడం లేదా? నిజంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలు లేవా?”

 
కోస్తా ప్రాంతంతో పోల్చినప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు అని అందరికీ తెలుసు.  విశాఖపట్నంలో రాజధాని పెడితే ఒక్క విశాఖ మాత్రమే అభివృద్ధి చెందుతుందా?  ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందదా?   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనుకోవడం కపటత్వమా లేక మిగిలిన అన్ని జిల్లాల సంపదను తన కులం వాళ్ళున్న ఒకే ప్రాంతంలో పోగేసి అభివృద్ధి చేయాలనుకోవడం కపటత్వమా మిస్టర్ రాధాకృష్ణా? 
 
***
 

“అందుకే జైపాల్‌ రెడ్డి అన్నట్టు ఉద్దేశాలూ, లక్ష్యాలూ కాదు, వాటిని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గం కూడా ముఖ్యం. కపట విన్యాసాలకు ఎపుడో ఒకప్పుడు కాలం చెల్లుతుంది!”

 
హుర్రే..రాధాకృష్ణ….వాస్తవాన్ని భలే కక్కేశావ్!  బులెట్ రైళ్లు, జిల్లాకో విమానాశ్రయం, యాభై అంతస్తుల ఆకాశహర్మ్యాలు…జపాన్, టోక్యో…లండన్, సింగపూర్, ఇడ్లీపాత్రలు, చివరకు రాజమౌళి, బోయపాటి….ఈ కపటవిన్యాసాలకు పదిహేను మాసాలక్రితమే కాలం చెల్లిపోయింది!  ఇక మళ్ళీ అలాంటి కాలం రాకపోవచ్చు!  
 
“పలుకులు పంచదార…నిలువెల్లా విషపుధార!”  ఈ సామెత రాధాకృష్ణకు సరిగ్గా అతుకుతుంది! 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు