ఎన్నికల సంఘానికి భారీ ఎదురుదెబ్బ!  

A huge setback for the Electoral Commission
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అర్థరహితమైన దూకుడుకు హైకోర్టు బలమైన పగ్గాలు బిగించి బంధించి మూల కూర్చోబెట్టింది. మొదటినుంచి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుతూ ఎన్నికల కమీషనర్ అన్న రాజ్యాంగపదవికే కళంకం తెచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హై కోర్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అభిశంసన లాంటివి.  హైకోర్టు చేసిన ప్రధానమైన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
 
1 . రాజ్యాంగం ప్రకారం ప్రజలు జీవించే హక్కును కాలరాయలేము. 
2  ప్రజారోగ్యం ఎన్నికలకన్నా  ముఖ్యం.
3 ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఏకపక్షంగా ప్రకటించింది
4 . ప్రభుత్వ సూచనలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు 
 
పై నాలుగు ముఖ్యాంశాలను పరిశీలిస్తే హైకోర్టు వ్యాఖ్యలు ఎన్నికల కమీషనర్ పాలిటి అభిశంసనగా పేర్కొనాలి.  ఎన్నికల కమీషనర్ కు ఏమాత్రం విచక్షణ ఉన్నా తక్షణమే రాజీనామా చేసి పోవాల్సినంత తీవ్రమైనవి.  అయితే నిమ్మగడ్డ మాత్రం తాము మళ్ళీ డివిజన్ బెంచ్ కు అపీల్ చేస్తామని చెప్పడం ద్వారా ఆయన లో ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని స్పష్టం అవుతుంది.  డివిజన్ బెంచ్ కు వెళ్లినా, దేవేంద్రసభకు వెళ్లినా నిమ్మగడ్డను భంగపాటు తప్పదు.  ప్రజల ప్రాణాలను, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వదు.  ఆమాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా మరో రెండు నెలల్లో ఇంటికి వెళ్లాల్సిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజాధనంతో న్యాయస్థానాల్లో పోరాడతానని చెబుతుంటే జాలి వేస్తుంది.  ఇక్కడ హైకోర్టు నిమ్మగడ్డ ఆదేశాల మీద స్టే ఇవ్వలేదు.  ఏకంగా షెడ్యూల్ నే రద్దు చేసింది.  అంటే అర్ధం ఏమిటి?  నిమ్మగడ్డ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం అని విస్పష్టంగా ప్రకటించినట్లు కదూ?  
  
A huge setback for the Electoral Commission
A huge setback for the Electoral Commission
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం కమీషనర్ గా ఒక్క నిముషం కూడా పదవిలో ఉండటానికి అనర్హుడు.  ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రాధమిక అంశం అని కోర్ట్ అక్షింతలు వేసిన తరువాత కూడా ఇంకా ఆయన ఏదో ఊడబొడుస్తానని బీరాలు పోతే ఆయన ఎప్పటికైనా ప్రజాగ్రహాన్ని చవిచూస్తారు.  ఇకనైనా ఆయన చంద్రబాబు మనిషిలా కాకుండా రాజ్యాంగబద్ధ అధికారిగా ప్రవర్తిస్తే ఆయనకు కాస్తైనా పేరు ఉంటుంది.   అలా కాకుండా పదవీవిరమణ చేసే చివరి రోజు వరకూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటానంటే అది ఆయన ప్రారబ్దం అని సరిపెట్టుకోవాలి.  
 
ప్రజల ఆరోగ్యానికి, క్షేమానికి పట్టం కడుతూ ఎన్నికల కమీషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన జగన్ ప్రభుత్వం ప్రశంసలకు అర్హురాలు.  జగన్ నిర్ణయం ప్రజలకు ఎనలేని మేలు చేస్తుంది.  ప్రభుత్వం తరపున సమర్ధవంతంగా వాదనలు వినిపించి కోర్టును ఒప్పించిన ఏజీ శ్రీరామ్ చరిత్ర సృష్టించారు. ఆయనకు అభినందనలు.     
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు