ఈ కుర్రాడు మాములోడు కాదు..15 ఏళ్లకే ఇంజనీర్

పదిహేనేళ్లకు మహా అయితే పదో తరగతి పూర్తవుతుంది కదా కానీ ఈ కుర్రాడు ఏకంగా ఇంజనీర్‌నే పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. తనకు 18 ఏళ్లు వచ్చే సరికి డాక్టరేట్ సాధించడమే తన లక్ష్యమని, అమెరికా అధ్యక్షుడిని కావాలని కోరుకుంటున్నట్టు ఆ కుర్రాడు తెలిపాడు. ఇంతకీ ఆ బుడతడు ఎవరూ..

అతనే భారత సంతతికి చెందిన బాలమేధావి తనిష్క్ అబ్రహాం. కేరళకు చెందిన బిజో అబ్రహం, తజి దంపతులు అమెరికాలో సెటిలయ్యారు. అబ్రహం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా, వెజీ వెటర్నరీ వైద్యురాలిగా పనిచేస్తుంది. వారి కుమారుడే తనిష్క్ అబ్రహాం.  అబ్రహం పదేళ్లకే అతిచిన్న వయసులో హైస్కూల్ విద్య పూర్తిచేసి అరుదైన ఘనత సాధించాడు. ఏడో తరగతి నుంచి ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటూ ఈ ఘనత సాధించాడు. ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు అబ్రహం.

డిగ్రీ పట్టా అందుకుంటున్న అబ్రహం

అబ్రహం కొన్ని రోజుల ముందే తనకు పదిహేనో పుట్టిన రోజు జరుపుకున్నాడు. కొన్ని రోజులకే డిగ్రీ పట్టా పొందాడు. డిగ్రీ పట్టా పొందిన తర్వాత తను అంతటితో ఆగలేదు. యూసీ డేవిస్ మెడికల్ సెంటర్ లో తన సీనియర్ డిజైన్ ప్రాజెక్టు సమర్పించాడు. అమెరికా మాజీ  అధ్యక్షుడు ఒబామాతో తనిష్క్ ప్రశంసలందుకున్నాడు. అబ్రహం ప్రతిభను గుర్తించిన యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్, యూసీ శాంతాక్రజ్ లు తమ క్యాంపస్ లో చేరాలంటూ అబ్రహంను కోరాయి. అబ్రహం ప్రస్తుతం ఎందులో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివి 18 ఏళ్లు వచ్చే సరికి అబ్రహం ఎండీ పట్టా అందుకోవాలనుకుంటున్నాడట. నేను అందరి పిల్లలలాగానే వీడియో గేమ్ లు ఆడుతూ చదువుతానని నిరంతరం నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తానని అబ్రహం అంటున్నారు. నిజంగా అబ్రహం గ్రేట్ కదా.. అతి చిన్నవయసులో పట్టాలు పొందడం చాలా అరుదైన విషయం…

తల్లిదండ్రులు, చెల్లెలితో అబ్రహం