డబ్బు లేకనే జగన్ వెనక్కి తగ్గుతున్నారా ?

ఈసారి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల అంశం ప్రధానంగా హైలెట్ అయింది.  శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని నిర్ణయించారు.  ఈమేరకు మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకుని శాసన మండలికి తీసుకొచ్చారు.  అయితే క్రితంసారి ఎలాగైతే తెలుగుదేశం, వైసీపీల నడుమ రసాభాస జరిగి బిల్లు ఆమోదం పొందలేదో ఈసారి కూడా అలాగే జరిగింది.  బిల్లు ఆమోదం పొందకుండానే మండలి నిరవధిక వాయిదా పడింది.  కానీ గవర్నర్ ప్రసంగంలో తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని చెప్పడంతో రాజధాని తరలింపు ఖాయమనే మెసేజ్ వెళ్ళింది ప్రజల్లోకి. 

Read More:అయ్యో… కేసీఆర్ చేతులేత్తిసిండా ?

ఇక కార్యాలయాల తరలింపులు మొదలవుతాయని అందరూ భావించారు.  కానీ తాజాగా వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజధాని విషయంలో ఇప్పుడే ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోమని అన్నారు.  శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అనేది అందరికీ తెలుసని అంటూనే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోబోమని మెలిక పెట్టారు.  రాష్ట్రంలో కరోనా వుదృతి ఎక్కువగా ఉందని, జూలై నాటికి కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉన్నందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని గురించి ఏమీ మాట్లాడలేమని, అన్నీ సద్దుమణిగాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

శాసన మండలిలో గవర్నర్ మాటలు, రాజధాని బిల్లు ముందుగా చర్చకు రావాలని వైసీపీ పట్టుబట్టిన తీరు చూస్తే మరోసారి మండలి సమావేశం నిర్వహించైనా బిల్లును చర్చకు పెడతారని అందరూ అనుకున్నారు.  కానీ ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలు విన్నాక జగన్ రాజధాని అంశాన్ని కొన్నాళ్లు వెనక్కి నెట్టే ఆలోచన చేశారా అనే అనుమానం కలుగుతోంది.  ఎందుకంటే ఇప్పటికిప్పుడు రాజధాని విషయంలో తొందరేమీ లేదని మాట్లాడింది వేరొక నేత అయితే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.  కానీ పెద్దిరెడ్డిగారే అనేసరికి అనుమానం కలుగుతోంది.  

Read More: ప్ర‌ణ‌య్-అమృత‌పై వ‌ర్మ సినిమా..జాలిప‌డ్డ అమృత‌

వైసీపీలో జగన్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న నేత పెద్దిరెడ్డిగారు.  జగన్ ఎవరి మాటను విన్నా వినకపోయినా పెద్దిరెడ్డిగారి మాట తప్పక వింటారనే టాక్ ఉంది.  అలాంటి కీలక వ్యక్తి రాజధాని విషయంలో వెనక్కి తగ్గినట్టు మాట్లాడటంతో జగన్మోహన్ రెడ్డి ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.  ఇక టీడీపీ శ్రేణులైతే సీఎం వేరే పనులేమీ పెట్టుకోకుండా తమ మీదే మొత్తం దృష్టి పెడతారేమోనని కంగారుపడుతుండగా కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతుల్లో 
పెద్దిరెడ్డిగారి వ్యాఖ్యలతో తమ బాధలు తీరే అవకాశం ఏదైనా ఉంటుందేంమోననే ఆశలు చిగురిస్తున్నాయి.  

Read More : ప్చ్.. పవన్ నీ స్టాండ్ ఏమిటి ?

మరోవైపు బడ్జెట్ నిధులు మొత్తం సంక్షేమ పథకాలకే కేటాయించటం వలన ఇప్పటికిప్పుడు కొత్త రాజధానుల ఏర్పాటుకు ఖజానాలో డబ్బు లేకే ఈ దాటవేత మాటలని కొందరు, వైజాగ్లో ఎలాంటి కొత్త పెట్టుబడులూ రావడం లేదని అందుకే పునరాలోఛనలో పడ్డారని కొందరు అంటున్నారు. ఈ మాటల్లో నిజం లెకపోలేదు.ఎందుకంటే బడ్జెట్లో దాదాపు పూర్తి మొత్తాన్ని నవరత్నాల కోసమే కేటాయించుకున్నారు.  రాజధాని మౌలిక వసతుల పేరిట 500 కోట్లు మాత్రమే కేటాయించారు.  ఈ చిన్న మొత్తంతో వైజాగ్ లాంటి నగరంలో కొత్త భవంతులు, పాలక వర్గానికి, నేతలకు నివాస సముదాయాలు అంటే కుదరని పని.  అందుకే కాబోలు ఇప్పటికి రాజధానుల విషయాన్ని కొంత వెనక్కి తీసుకెళ్తున్నారేమో అనిపిస్తోంది. ఇక వైసీపీ శ్రేణులకైతే పెద్దిరెడ్డిగారి మాటల్లోని ఆంతర్యం అంతుబట్టక తికమక పడుతున్నారు.