ఆ సంస్థ కోసం ఒక్కటవుతున్న నెటిజన్లు

ఆ సంస్థ కోసం ఒక్కటవుతున్న నెటిజన్లు

by Sekhar Sunkara

దేశం నాకేం ఇచ్చింది అని కాకుండా దేశానికి నేనేం చేయగలను అని ఆలోచించే సమయం ఇది.

“భారతీయులు అందరూ నా సహోదరులు” ఈ మాట మనం చిన్నప్పుడు స్కూల్స్ లో వినే ఉంటాం, దీన్ని ఎంతమంది ఆచరించారో తెలియదు కాని ఒక సంస్థ మాత్రం తుచ్ఛ తప్పకుండా ఆచరిస్తుంది. దేశం లో రిక్షా వ్యాపారం తో మొదలయ్యి ప్రతి సామాన్య మధ్యతరగతి వారి ఏదుగుదలే లక్ష్యం గా పనిచేస్తున్న సంస్థ. ప్రతి భారతీయుడు నా అనుకునే సంస్థ, ప్రతి ఒక్కరికి సుపరిచితమే, భారతీయుల ఏదుగుదలే ఆ సంస్థ పెట్టుబడి అనడంలో అతిశయోక్తి లేదు…

ప్రతి మధ్య తరగతి వారి కల అయిన కార్ ని వారి అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ, యువతకి మెరుగయిన విద్యని అందించడం మాత్రమే కాకుండా వారి నైపుణ్యానికి ఉపాధి అవకాశాలు కల్పించడం లో కూడా ముందున్న సంస్థ…

నా దేశం నాకు చాలా ఇచ్చింది నా దేశానికి నేను ఎంత ఇచ్చిన తక్కువే అనుకుంటారు వారు, తన దేశం పై ఉగ్రదాడి ఉపక్రమించిన దేశానికి తన ఎగుమతులనే ఆపేసిన సంస్థ అది. వారు ఆర్జించే లాభాల్లో 50% పైగా దేశ అభివృద్ధికి ఖర్చుచేస్తున్న బహుశా భారతదేశం లో అదొక్కటే కావొచ్చే, అందుకే ప్రపంచ సంపన్నులలో అది ఎప్పుడు వెనకుంటుంది. ఈపాటికే అర్థమయ్యి ఉంటుంది దేని గురించి చెప్తున్నానో అదేనండి మనం మనది అని గర్వించే మన భారతీయ సంస్థ టాటా…

ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటారా ఈ కరోనా విపత్కర సమయం లో 1500 కోట్లు ప్రజా సంరక్షణకై దేశ ప్రధానికి ఇవ్వడం మెచ్చుకోకుండా ఉండలేని విషయం…

ఇది అందరికీ తెలిసిన విషయమే అయిన ప్రతి భారతీయుడ్ని కదిలించిందనే చెప్పాలి, నా దేశానికి ఇంత చేస్తున్న ఈ సంస్థ కి మేమేం చేయగలం అని ప్రతి భారతీయుడ్ని ఆలోచనలో పడేలా చేసింది. నా దేశాన్ని కాపాడటం లో టాటా సంస్థ చేస్తున్న దానికి మా వంతుగా మేము ఏదన్నా చేయాలి అనే ఆలోచన ప్రతి భారతీయుడిలో కదిలించిందనే చెప్పాలి..

మా మొదటి ప్రాముఖ్యత టాటా ఉత్పత్తులు మాత్రమే కొనాలి అనే ఆలోచన పురుడుపోసుకుంది.. అందుకు ఉదాహరణ సోషల్ మీడియా అయిన ఫేస్బుక్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న విషయం “మా మొదటి ప్రాధాన్యత టాటా ఉత్పత్తులు” అనే నినాదం. కొంతమంది టాటా ఉత్పత్తులని పరిచయం చేస్తుంటే మరికొంత మంది మేము ఈ టాటా ఉత్పత్తులని కొన్నాం మరి మీ సంగతేంటి అని స్నేహితులకు ఛాలెంజ్ విసురుతున్నారు, మరికొంత మంది మా రేషన్ లో టాటా ఉత్పత్తులకు ఇంత వెచ్చించామ్ ప్రతి నెల ఒక రూపాయి పెంచుకుంటూనే పోతాం అని అంటున్నారు, ఏది ఏమయినా ఇది మంచి శుభపరిణామం అనే చెప్పుకోవాలి..

దేశం వరకు వస్తే భారతీయులు అంతా ఒక్కటే అనే నినాదం ప్రతి భారతీయుడు నర నరాన చిరస్మరణీయం గా ఉందనే చెప్పుకోవాలి.

 

TATA Products

 

Ratan Tata showed the way to the donor in the midst of the COVID-19. people are getting TATA’s back by vowing to buy TATA products hence forth.