ఇంట్లో సిరిసంపదలకు లోటు లేకుండా ఉండాలంటే ఏ పూజ గదిలో ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండాలి..?

సాధారణంగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. ఇలా కష్టపడి పని చేయటమే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లోనే పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం. అందువల్ల పూజ గదిలో పూజకి అవసరమైన కొన్ని రకాల వస్తువులు తప్పనిసరిగా ఉంచాలి. మీ ఇంట్లో సిరిసంపదలు లోటు లేకుండా ఉండాలంటే పూజ గదిలో ఏ ఏ వస్తువులను ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• గంటలు : పూజ గదిలో తప్పనిసరిగా ఉంచాల్సిన వస్తువులలో గంట కూడా ఒకటి. పూజా సమయంలో గంట మోగించి హారతి ఇస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లో పూజ గదిలో గంట తప్పనిసరిగా ఉండాలి.
• దీప హారతి : ప్రతి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడు ముందు దీపం వెలిగించి హారతి ఇస్తూ ఉంటారు. ఇలా దీప హారతి ఇవ్వటానికి ముఖ్య కారణం కూడా. ఎందుకంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించి ఇలా దీపాన్ని వెలిగించి హారతి ఇస్తారు.
• కర్పూర హారతి : పూజాంతరం దేవుడికి కర్పూర హారతి ఇవ్వటానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. పూజ ముగిసిన తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇస్తూ మనలోని అహంకారం కర్పూరం వలే కరిగిపో పోవటానికి సూచనగా ఇలా కర్పూర హారతి ఇస్తారు.
• పుష్పం : దేవుడికి పూజ చేసే సమయంలో పుష్పాలను సమర్పించి పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇలా పుష్పాలు సమర్పించి పూజ చేయడం అనేది సుగంధ పరిమళాన్ని వెదజల్లే మనసును దైవానికి సమర్పించడం అని అర్థం.
•ఫలం ( మనస్సు): మనసు ఫలాలు అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించకుండా దేవుడికి అర్పించడం అని అర్థం.
•పత్రం (శరీరం) : త్రిగుణాలతో కూడుకున్న పత్రం దేవుడికి సమర్పించటం.
•కొబ్బరికాయ : హృదయమనే కొబ్బరికాయని కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల కోరికలు అనే పీచు నుండి కొబ్బరికాయను వేరుచేసి తీయనైన కొబ్బరిని దేవుడికి సమర్పించాలి. అంటే మనలో ఉన్న కోరికలను వదిలేసి మన హృదయాన్ని భగవంతుడిపై లీనం చేయడం.