పితృపక్షాలు చేయలేని వారు ఏం చేయాలి ?

భాద్రపదమాసంలో వచ్చే పితృపక్షాలను తప్పక ఆచరించాలని శాస్త్రవచనం. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలుసుకుందాం… ఏటా నిర్వహించే తద్దినం, ఆబ్దికం కన్నా ఇప్పుడు పెట్టే శ్రాద్ధం చాలా ముఖ్యం. అయితే ఈ పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక ఇబ్బందుల ఉండి శ్రాద్దం పెట్టలేనివారు కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అదీ వీలు కాకుంటే గోవులకు పచ్చగడ్డి, దానాను సమర్పించాలి.

ఒకవేళ ఇదీ సాధ్యం కాని వారు అంటే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు నిర్జన ప్రదేశం లేదా ఇంటిలో ఖాళీ ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయం(మధ్యాహ్నం 12-2 గంటల) మధ్యలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలను తలుచుకుని నమస్కారం చేయాలి. మనస్సులో తన అశక్తతను పెద్దలకు చెప్పుకోవాలి.