Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ… బంగారం కొనలేక బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు బంగారు లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని, సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికి నేడు బంగారం కొనాలంటే అంత స్తోమత ఉండదు. ఇలా నేడు బంగారం కొనలేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. మరి బంగారం కొనలేని వారు ఈ చిన్న పని చేస్తే చాలు అష్ట ఐశ్వర్యాలు మీ వెంటే ఉంటాయి.

ప్రతి ఏడాది అక్షయ తృతీయను వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి రోజు జరుపుకుంటారు. ఈరోజు బ్రహ్మ దేవుని కుమారుడు అక్షయ్ కుమార్ జన్మించడం వల్ల నేడు అక్షయ తృతీయని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందుకే నేడు బంగారు నగలు కొనుగోలు చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు.ఇక బంగారం కొనే స్తోమత లేని వారు యధావిధిగా ప్రతి రోజులాగే తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసే దేవుడి గదిలో పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే దేవుడి గదిలో బియ్యపుపిండితో ముగ్గు వేసే అక్కడ కలశం ఏర్పాటు చేసుకోవాలి.

ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకున్న అనంతరం పసుపుతో వినాయకుడిని తయారుచేసి ఆ వినాయకుడికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలను కలిగిస్తారు.ఈ విధంగా అక్షయ తృతీయ రోజు కలశం ఏర్పాటు చేసిన వినాయకుడిని పూజిస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఇక స్వామివారికి నేడు చక్కెర పొంగలి లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మన స్తోమత కొద్ది దానధర్మాలు చేయడం మంచిది. నేడు ఇలా చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.