సాధారణంగా అందరి దేవుళ్లను భక్తితో కొలుస్తారు. కానీ శని దేవుడిని మాత్రం ప్రతి ఒక్కరూ భక్తి కంటే భయంతోనే ఎక్కువగా కొలుస్తారు. ఎందుకంటే శని దృష్టి మన పై పడితే జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది. మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వవు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల శని దేవుడి ప్రభావం నుండి విముక్తి పొందటానికి శని దేవుని పూజించడమే కాకుండా వివిధ రకాల పరిహార మార్గాలను కూడా అనుసరించాలి. శని ప్రభావం నుండి విముక్తి కలిగించే పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా శని ప్రభావం నుంచి బయట పడాలంటే ప్రతి శనివారం రోజున శని దేవుని ముందు నువ్వులు నూనె తో దీపం వెలిగించాలి. అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయాలి. అంతే కాకుండా ఈ శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే చాలామంది శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలిరంగు రత్నాలను ధరించాలి. నీలి రంగురత్నం ధరించడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇలా నీలి రంగు రత్నం ఖరీదైనది అయినప్పటికీ ఈ రత్నం ధరించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. అయితే ఈ రత్నం ధరించేటప్పుడు కొన్ని రకాల నియమాలను తప్పక పాటించాలి. ఈ రత్నం ధరించిన వారు శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడి అనుగ్రహం మనపై ఉంటుంది.