ఈ రెండు వంటనూనెలతో గుండె జబ్బులు అస్సలు రావట.. అవేంటంటే?

గడిచిన 10 రోజుల్లో ఏకంగా ఏడు మంది గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. సరైన వంటనూనెను ఎంచుకోకపోవడం కూడా గుండె సంబంధిత సమస్యలకు కారణమని చాలామంది భావిస్తారు. రెండు రకాల వంటనూనెలను ఎంచుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.

రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయి. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు సైతం తమ ఆహారంలో ఈ రెండు వంటనూనెలను చేర్చుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వంటనూనెలు వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వంటనూనెలు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.

ధరలతో సంబంధం లేకుండా ఈ వంటనూనెలను వాడటం ద్వారా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ వంటనూనెల వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అలవాట్లలో కీలక మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వంటనూనెల విషయంలో సరైన అవగాహనను కలిగి ఉంటే మంచిది.

రిఫైన్డ్ ఆయిల్స్ తో పోలిస్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ను వాడటం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ ఆహారపు అలవాట్లకు సంబంధించి మార్పులు చేసుకుంటే మంచిది. నూనెల్లో మునిగిన వస్తువులను తినడానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు,