దేవుడికి సమర్పించే పుష్పాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..?

Bro4u-puja

మన హిందూ సాంప్రదాయంలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది. దేవుని పూజించే సమయంలో భక్తిశ్రద్ధలతో పుష్పాలు, పండ్లు ,జలం , నైవేద్యం సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు? పుష్పాలను దేవుడికి సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. అసలు పూజలు పుష్పాలు ఎందుకు ఉపయోగిస్తారు? ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*పూజలో దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో ఉండేలా చూసుకోవాలి. అంటే పురిటి వారు, మైలవారు, బహిష్టులైన మహిళలు ఆ పుష్పాలను తాకకుండా జాగ్రత్త వహించాలి. అలాంటి వారు తాకిన పుష్పాలను పొరపాటున కూడా పూజలో ఉపయోగించకూడదు.

• అలాగే చెట్టు నుండి రాలిపోయి భూమిపై పడిన పుష్పాలను దేవుడికి సమర్పించకూడదు. అలాగే వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను కూడా పూజకు వినియోగించకూడదని వేద పండితులు చెబుతున్నారు.

• ప్రతిరోజు స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర పుష్పాలను మాత్రమే పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి. అప్పుడే ఆ పూజా ఫలితం లభిస్తుంది.

• అయితే కొన్ని దేవుళ్లను పువ్వులతో కొన్ని రకాల పత్రాలతో పూజిస్తారు. మహా శివునికి మారేడు దళాలలు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల శివుని పూజలు పువ్వులు లేకపోయినా , మారేడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

• అలాగే విష్ణు భగవానుడిని పూజించేటప్పుడు ఆయనకు ఇష్టమైన తులసి దళాలు సమర్పించి పూజించాలి.