కార్తీకమాసంలో ఇవి చాలా ముఖ్యం !

కార్తీకమాసం చాలా ముఖ్యమైనది. ఈమాసంలో సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తదితర పుణ్యతిథులలో కొన్నినియమాలను తప్పక పాటిస్తే ఎన్నోరెట్ల ఫలితాలు వస్తాయి. కార్తీకమాస నియమాలలో కొన్నింటిని తెలుసుకుందాం…
ఉపవాసం: కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం.
ఏకభుక్తం: దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.


నక్తం: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి.
అయాచితం: భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం.
స్నానం: శక్తిలేని వాళ్లు సమంతరం స్నానం, జపం, ధ్యానం చేయండి.
పైవేవీ వీలుకాకుంటే నిరంతరం శివపంచాక్షరీ లేదా విష్ణు అష్టాక్షరి మనసులో జపించండి. అత్యంత పవిత్రమైన మనసుతో భగవత్‌ ధ్యానం చేయడం అన్నింటికంటే చాలా ముఖ్యం. శుభఫలితాలను ఇస్తుంది. సకల పాపాలను పోగుడుతుంది.