శ్రీవారి నిజరూపదర్శనం విశేషాలు ఇవే !

the reality of lord venkateswara swamy

శ్రీశ్రీనివాసుడు.. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలూ లేకుండా దర్శనమిస్తారు. నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టుధోవతిని ధరింపజేస్తారు.

కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు. గురువారం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానిక్కూడా సిబ్బంది భయపడతారు. ఎందుకంటే పుణ్యకార్యాలు చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం. గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు. ఇలా శ్రీవారి ఆలయంలో అనేక విశేషాల మయం.