శ్రీరామనవమి రోజు ఇటువంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు..?

SriRamaNavamiEvent

భారతీయ ప్రజలందరూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు కూడా చాలా విశిష్టత ఉంది. ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చైత్ర నవరాత్రి చివరి రోజు జరుపుకునే శ్రీరామనవమి కూడా ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 30 న శ్రీ రామ నవమి జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున పుష్య నక్షత్రంలో పూర్ణిమ రోజున శ్రీ రాముడు అవతరించినందున.. శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు :

భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటున కూడా మాంసం మద్యం సేవించరాదు. అలాగే పండగ రోజు తయారు చేసే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు. అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆ శుభమని పండితులు చెబుతున్నారు. అందువల్ల పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు. భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు.

శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులు :

ఓం శ్రీ రామయ: నమ:
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
ఓం దశరథయే విద్మహే సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి. శ్రీ రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది. అలాగే ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. వీటన్నింటిని ఏకకాలంలో నామ జపం, మంత్రాలు, శ్లోక పఠనంతో అనుసరించాలి. దశమి తిథి వరకు మొత్తం తొమ్మిది రోజులు పాటు అఖండ జ్యోతిని వెలిగించాలి.