Sri Ram Navami 2024: శ్రీరామనవమి రోజు ఎలాంటి పనులు చేయకూడదు.. పూజా సమయం ఇదే?

ఈ సంవత్సరం 2024 లో శ్రీ రామ నవమి ఏప్రిల్ 17 న జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది ఈ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు భారతదేశ ప్రజలు. ఈ రోజున రాముడికి ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే శ్రీరామనవమి రోజున శ్రీరాముని పూజించడంతో పాటు ఆ రోజు కొన్ని రకాల పనులు చేయకుండా ఉండడమే మంచిది అంటున్నారు పండితులు. అలా తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి పనులు చేయకూడదు.

అలాగే పూజా విధి విధానం సమయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా శ్రీ రామ నవమి రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే.. శ్రీ రామనవమి రోజున మీరు తీసుకున్న చర్యల ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీ రామనవమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. రామ నవమి రోజున తామసిక ఆహారం, మాంసం, మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకూడదు. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. కోపానికి, అబద్ధాలకు, చెడుకు దూరంగా ఉండాలి. ఎవరికీ హాని చేయకుండా అందరితో ప్రేమగా నడుచుకోవాలి.

2024 సంవత్సరంలో శ్రీ రామ నవమి ఏప్రిల్ 17, బుధవారం వచ్చింది. పూజ శుభ సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:38 వరకు. అటువంటి పరిస్థితిలో పూజకు సమయం 2 గంటల 35 నిమిషాలు ఉంటుంది. నవమి తిథి 16 ఏప్రిల్ 2024న మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 3:14 గంటలకు ముగుస్తుంది.