కలలో దేవుళ్లు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా.. దేవుడు కనిపిస్తే మంచి జరుగుతుందా?

మనలో చాలామందికి కలలు వస్తుంటాయి. కొంతమందికి నిద్ర లేచిన తర్వాత కూడా కలలు గుర్తుంటే మరి కొందరికి మాత్రం గుర్తుండవు. స్వప్న శాస్త్రం ప్రకారం మనం కనే ప్రతి కల వెనుక ఒక అర్థం ఉంటుంది. కలలో దేవుడు కనిపిస్తే దేనికి సంకేతమో స్వప్న శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. కలలో దుర్గామాత కోపంగా కనిపిస్తే దేవత మనపై ఆగ్రహంగా ఉందని అర్థం చేసుకోవాలి. దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు కల వస్తే మన సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.

కలలో శివుడు కనిపిస్తే సమస్యల నుంచి త్వరలో విముక్తి లభిస్తుందనే అర్థం వస్తుంది. కలలో శివలింగం కనిపిస్తే మాత్రం జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని అర్థం చేసుకోవచ్చు. కలలో రాముడు కనిపిస్తే జీవితం శుభప్రదంగా ఉందనే అర్థం వస్తుంది. లైఫ్ లో సక్సెస్ కావాలంటే విధులను సక్రమంగా నిర్వహించాలని ఆ కలకు అర్థం అని చెప్పవచ్చు. కలలో కృష్ణుడు కనిపిస్తే జీవితంలో ప్రేమ చిగురిస్తుందని అర్థం వస్తుంది.

ఇప్పటికే ఎవరితో అయినా ప్రేమలో ఉంటే ఆ ప్రేమ సఫలం అవుతుందని ఆ కలకు అర్థం అని చెప్పవచ్చు. కలలో విష్ణువు కనిపిస్తే చేపట్టిన పనిలో సక్సెస్ దక్కుతుంది. విష్ణువు కనిపిస్తే జీవితంలో పురోగతి దక్కుతుంది. కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్టు కనిపిస్తే ఆ కలను పవిత్రమైన కలగా పరిణంచాలి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే త్వరలోనే లాభాలు వస్తాయని అర్థం వస్తుంది.

కలలో దేవుడు కనిపిస్తే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. అధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్నవాళ్లకు దేవుడి కలలు ఎక్కువగా వస్తాయి. కలలో వినాయకుడు కనిపిస్తే త్వరలో సమస్యలు పరిషకారం కావడంతో పాటు అదృష్టం కలిసొస్తుంది. కలలో సరస్వతీ దేవి కనిపిస్తే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. కలలో కాళీ దేవి కనిపిస్తే అధ్యాత్మికత వైపు మనస్సు మళ్లుతుందని అర్థం.