Sri Ramanavami: ఈ శ్రీరామనవమి రోజు అరుదైన యోగం.. రామయ్యను ఇలా పూజిస్తే చాలు!

హిందువులు ప్రతీ ఏడాది శ్రీరామ నవమి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా 17 ఏప్రిల్ 2024 బుధవారం రోజున శ్రీ రామ నవమి పండుగను జరుపుకోనున్నారు. శ్రీ రామ నవమి శ్రీ రాముడు జన్మ దినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా. రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు. చైత్ర మాసం నవమి రోజున విష్ణుమూర్తి మానవ రూపంలో శ్రీ రాముడిగా అవతారం ఎత్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అటువంటి పరిస్థితిలో శ్రీరాముని జన్మ దినోత్సవాన్ని అభిజిత్ ముహూర్తంలో జరుపుకోవడం శుభపరిణామం.

చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజు శుక్ల పక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామ నవమి నాడు చాలా అరుదైన, ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది. శ్రీరాముని జాతకంలో ఉన్న గజకేసరి యోగం ఈ రోజున ఏర్పడుతున్నందున ఈ సంవత్సరం రామనవమి పండుగ ప్రజలకు చాలా పవిత్రమైనది అని చెప్పాలి. ఈ కలయిక సంభవించినప్పుడు వ్యక్తి గజానికి సమానమైన శక్తిని, సంపదను పొందుతాడు. ఈ ఏడాది శ్రీ రామ నవమి నాడు, ఈ యాదృచ్ఛికాలు కలిసి రావడంతో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇకపోతే నవమి రోజున ఒక ప్రత్యేక శుభ ముహూర్తం ఉంది. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 1:40 గంటల మధ్య అభిజిత్ ముహూర్తం.

ఈ సమయంలో రామజన్మోత్సవాన్ని జరుపుకుని రామయ్యకు హారతి ఇవ్వాలి. అయితే ఎవరైనా పూజాభిషేకం, గృహనిర్మాణం, గృహ ప్రవేశం, దుకాణం ప్రారంభోత్సవం, కర్మాగార పూజలు, దుకాణ పూజలు వంటి ఏదైనా శుభకార్యాలు, ప్రారంభ పనులు చేయాలనుకుంటే అప్పుడు నవమి రోజున రోజుకు రెండు సార్లు ఉదయం 11:40 మధ్య, మధ్యాహ్నం 1:40 గంటలకు పూజ చేయడం మంచిది. శ్రీ రామ నవమి పూజలో సీతారామ లక్షణ హనుమంతుడి ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కర్పూరం, పువ్వులు, దండ, మొదలైన వాటిని ఏర్పాటు చేసుకోవాలి..శ్రీరాముని ఇత్తడి లేదా వెండి విగ్రహానికి అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, పంచదార, గంగాజలం సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా నైవేద్యానికి స్వీట్లు, పసుపు బట్టలు, ధూపం, దీపం, సుందరకాండ లేదా రామాయణ పుస్తకం, తమలపాకులు, ఖార్జురం ఉపయోగించడం మంచిది. ఐదు పండ్లు, పసుపు, ధూపం, దీపం, తులసి దళాలు, వంటి వాటిని పూజలో చేర్చుకోవాలి.

శ్రీ రామ నవమి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీరు అక్షతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటి లోపలకు వచ్చి, రాముడి జన్మదినోత్సవం కోసం ఇంటిలోని పూజ గదిలో ఉన్న పీఠాన్ని అలంకరించిన తర్వాత, కలశాన్ని ప్రతిష్టించి, అక్కడ వినాయకుడిని ప్రతిష్టించి, గణేశుడిని పూజించాలి. ఆ తరువాత రామయ్యను పూజించాలి. రామయ్యను ఆవాహన చేస్తూ రామయ్యకు పాలు, పెరుగు కలిపి అభిషేకం చేయాలి. అభిషేకం తరువాత వివిధ రకాల పుష్పాలతో అలంకరించాలి. దుస్తులను కట్టి నుదుటిపై తిలకం దిద్దండి. అనంతరం 108 సార్లు శ్రీ రామ నామాన్ని జపమాలతో జపించండి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ రామయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.