ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు నిజాయితీగా ఉన్నట్లే…. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

నిజాయితీ అనేది ఎన్నో బంధాలను నిలబెడుతుంది. నిజాయితీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన మంచి లక్షణం అయితే అందరూ కూడా ఇతరుల పట్ల నిజాయితీగా ఉండరు. కొందరు మాత్రమే నిజాయితీగా ఉంటారు. నిజాయితీ అనేది మంచి లక్షణం కనుక ఈ లక్షణాన్ని అలవరచుకోవడం మంచిది. ఎప్పుడైతే మనం నీతి నిజాయితీగా ఉంటాము అప్పుడే మనకు గౌరవం కూడా లభిస్తుంది.నీతిక ఉండే వారిలో తప్పనిసరిగా ఈ లక్షణాలు ఉంటాయి మరి ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు కూడా నిజాయితీపరులని అర్థం.

నిజాయితీగా ఉండే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులు వాళ్ళని ఇష్టపడాలని కోరుకోరు.వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇతరుల గురించి కానీ ఇతరులను ఇంప్రెస్ చేయాలని కానీ పని చేయరు. ఎవరైతే నిజాయితీగా ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటారు.అందరిని బాగా అర్థం చేసుకుంటారు ఇక నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా తమ ఆనందాన్ని వస్తువులలోనూ కొత్త బట్టలలో వెతుక్కోరు.

ఎప్పుడు కూడా ఇలా నిజాయితీగా ఉండేవారు తమ ఆనందాన్ని కుటుంబ సభ్యులలోను బంధుత్వాలలోనూ వెతుక్కుంటారు. ముఖ్యంగా నిజాయితీగా ఉన్నవారిలో అహంకారం అస్సలు ఉండదు. అహంకారం ఆధారంగా వీళ్ళు ఎలాంటి నిర్ణయాలను తీసుకోరు.నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా శత్రువులకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటారు. ఇలా ఈ లక్షణాలన్నీ మీలో కనుక ఉంటే మీరు నిజాయితీగా ఉన్నారని మీరు నిజాయితీపరులేనని అర్థం.