శివాభిషేకం.. ఏ ద్రవ్యాలతో చేస్తే ఏం ఫలితం ?

కార్తీకమాసం వచ్చిందంటే అంతటా శివోహం.. శివనామస్మరణలతో మారుమ్రోగుతుంది. అందులో ఉపవాసం,శివాభిషేకం చాలా విశేషంగా ఆచరిస్తారు భక్తులు. శివుడు అభిషేక ప్రియుడు అని శాస్త్ర వచనం.
శివో అభిషేక ప్రియ-అంటే “శివుడు అభిషేక ప్రియుడు” దోసెడు నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సకల సంపదలు, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఆయన కోటీశ్వరుడుకైనా కూటికి లేనివాడికైనా సమానంగా వరాలిస్తాడు. కాసింత భస్మం అదేనండి బూడిద, కాసింత నీళ్లు చాలు, మారేడు దళం చాలు ఆయన సేవకు. భోళాశంకరుడు. అభిషేకం చేస్తే చాలు అనందంతో అనుగ్రహిస్తాడు. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత ఉన్నాయి.


శివుడ్ని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం..భక్తులు కార్తీక మాసంలో వివిధ పూజా ద్రవ్యాలతో శివుని అభిషేకించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు.
ద్రవ్యాలు – కలిగే ఫలితాలు
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం … పుత్ర లాభం
పుష్పోదకం… భూలాభం
బిల్వ జలం … భోగ భాగ్యాలు
ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) … దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
నువ్వుల నూనె… అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం
సువర్ణ జలం … దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
గంగోదకం … సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం… ధాన్య గృహ ప్రాప్తి
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం … సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం …. శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)… ద్రవ్య ప్రాప్తి
ధవళోదకమ్ … శివ సాన్నిధ్యం
మామిడి పండు రసం… దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ… మంగళ ప్రదం
విభూది …. కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.