దాదాపు అన్ని మతాలలో దానాలకు విశేష స్థానం ఉంది. తప్పక జీవితంలో అవకాశం ఉన్నప్పుడల్లా దానాలు చేయాలని ఆయా మతాలు చెప్తాయి. ఇక హిందుమతంలో నిత్యం దానం చేయాలని ఉంది. భోజనం చేసేటప్పుడు నుంచి నిద్రించేవరకు అనేక రకాల దానాలు, ధర్మాలు చేయాలని శాస్త్రవచనం. ప్రస్తుతం పితృపక్షాలు అంటే పితృసంబంధ దోషాలు పోవడానికి ఈ కాలం పెద్దల పేరున దానాలు చేయాలని పండితులు చెప్తున్నారు. అయితే ఏం దానం చేస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం…
బంగారుని దానం చేస్తే దోషాలు తొలగుతాయి. గోదానం చేస్తే రుణ విముక్తులౌతారు.బియ్యాన్ని దానం చేస్తే. పాపాలు పోతాయి. వెండిని దానం చేస్తే. మనశ్శాంతి కలుగుతుంది. పండ్లను దానంచేస్తే. బుద్ధి,సిద్ధి కలుగుతాయి. పెరుగును దానం చేస్తే… ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నెయ్యి దానం చేస్తే. రోగాలు పోయి…..ఆరోగ్యంగా ఉంటారు. పాలు దానం చేస్తే..నిద్రలేమి ఉండదు. తేనెను దానం చేస్తే. సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు దానం చేస్తే. మతిమరుపు తగ్గి జ్ణాపకశక్తి పెరుగుతుంది. టెంకాయ దానం చేస్తే. అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దీపాలు దానం చేస్తే నరకం రాదు. వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.
అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి, ధనవృద్ధి కలుగుతుంది. వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయాలి. దానం చేయమన్నారు కదా అని లేకున్నా అప్పులు చేసి దానం చేయకూడదు. కేవలం మీకు ఉన్నదానిలో శక్తిమేరకు భక్తితో శ్రద్ధతో దానం చేయాలి. మరో ముఖ్యవిషయం దానం చేసేటప్పుడు తీసుకునేవారిని పేదలని, నిర్భాగ్యులని భావించరాదు. సాక్షాత్తు పరమేశ్వరస్వరూపంగా భావించి దానం చేయాలి. ఆ పవిత్రమైన అవకాశం ఇచ్చినందుకు వారిపై ప్రేమ, భక్తి కలిగి ఉండాలి.