పితృదోషం వెంటాడితే అశుభాలే జరుగుతాయా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో పితృ దోషం గురించి వినే ఉంటారు. పితృ పక్షాల సమయంలో చనిపోయిన వాళ్లను తలచుకుంటూ పిండ ప్రదానం, శ్రాద్దం, తర్పణం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఆ కుటుంబాలలో పూర్వీకుల ఆత్మ శాంతించే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనపై పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందనే సంగతి తెలిసిందే.

 

అయితే ఈ పనులు చేయకపోతే మాత్రం పితృ దోషాలు వెంటాడుతాయని చెప్పవచ్చు. కొన్ని పరిహారాలను పాటించడం వల్ల సులభంగా పితృ దోషాలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. దహన సంస్కారాలు సరిగ్గా చేయకపోయినా, చనిపోయిన వాళ్ల కోరికలు తీరకపోయినా పితృ దోషాన్ని అనుభవించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

 

పూర్వీకులను అవమానించినా, ఇంట్లో ఆడవాళ్లను గౌరవించకపోయినా పితృ దోషం ఉంటుందని చెప్పవచ్చు. భాద్రపద అమవాస్య రోజున తెల్లని చందనం, తెల్లని పువ్వులు, నల్లటి నువ్వులు నీళ్లలో వేసి రావిచెట్టుకు సమర్పించారని సమాచారం అందుతోంది. ఓం సర్వ పితృ దేవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా అనుకూల ఫలితాలు ఉంటాయని సమాచారం అందుతోంది.

 

జంతువులు, శునకాలకు పితృ పక్షాల సమయంలో ఆహారం ఇస్తే మంచిదని చెప్పవచ్చు. దక్షిణ దిశలో ఉండే గోడలపై పూర్వీకుల ఫోటోను తగిలిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పితృ దోషం వెంటాడితే అంతా అశుభాలే జరుగుతాయి. కొన్ని నియమాలను పాటించడం ద్వారా పితృ దోషాలకు చెక్ పెట్టి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.