ఈ కలర్ చెప్పులు వేసుకుంటే దరిద్రం వెంటాడుతుందా.. ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందే!

మనలో చాలామంది వేసుకునే చెప్పుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చెప్పులు కొనే సమయంలో కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. కొన్ని రంగుల చెప్పులను మాత్రం అస్సలు వేసుకోవడం మంచిది కాదు. చెప్పులు కొనే సమయంలో స్టైల్, బ్రాండ్ కు ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది చెప్పుల ఖరీదును బట్టి కొనుగోలు చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

కొన్ని రంగుల చెప్పులు మనకు ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వృత్తి సమస్యలు తెచ్చిపెట్టే ఛాన్స్ అయితే ఉంది. పసుపు రంగు చెప్పులు పవిత్రతకు, మంచి శక్తికి సంకేతం అని చెప్పవచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు బృహస్పతి గ్రహంకు ప్రతీక అని చెప్పవచ్చు. పసుపు రంగు చెప్పులను ఎవరైతే ధరిస్తారో వారికీ బృహస్పతి ప్రభావం బలహీనపడుతుందని చెప్పవచ్చు.

దీని వల్ల వివాహ బంధంలో కలహాలు, పిల్లల పెళ్లిళ్లు ఆలస్యం వంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చదువుకునే వాళ్లు, ఉద్యోగం లేదా వ్యాపార అభివృద్ధి ఆశిస్తున్నవాళ్లు పసుపు రంగు చెప్పులకు దూరంగా ఉంటె మంచిదని చెప్పవచ్చు. చెప్పులు కొనుగోలు చేసేవాళ్ళు నలుపు, లేత గోధుమరంగు, బూడిద రంగులు ఎంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. శనివారం రోజున బ్లాక్ కలర్ చెప్పులు ధరించడం ద్వారా దోషాలు తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.

చెప్పులు పోగొట్టుకోవడం అనేది సాధారణంగా అశుభంగా పరిగణించబడుతుంది, ప్రత్యేకించి దేవాలయాల వంటి పవిత్ర ప్రదేశాలలో. ఇది వ్యక్తిగత నష్టం లేదా అపశకునంగా భావించబడుతుంది. అయితే, కొందరు వ్యక్తులు దీనిని ఒక రకమైన అదృష్టంగా కూడా భావిస్తారు, ముఖ్యంగా చెప్పులు దొంగిలించబడితే, అది శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.