దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులు కావాలంటే ఈ పనులు తప్పక చేయాలి..?

మన భారతీయ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా విశిష్టత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకంలోని కొన్ని దోషాల వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా దురదృష్టం వెంటాడటం వల్ల మనం చేపట్టిన పనులు సరైన సమయంలో నెరవేరకపోవటమే కాకుండా ఇతర సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే మన జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి మనం అదృష్టవంతులుగా మారాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అదృష్టవంతులుగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన జాతకం ప్రకారం దురదృష్టం వెంటాడుతుంటే అటువంటి సమయంలో కొబ్బరికాయ మీద పచ్చటి కర్పూరం పెట్టి 21సార్లు దిష్టి తీసి ఆ కొబ్బరికాయను పారుతున్న నీటిలో వదిలివేయాలి. ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి జాతకంలో ఉన్న దోషం మొత్తం తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే ఈ పరిహారాన్ని కేవలం మంగళ, గురు, శనివారాలలో చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలాగే మన జాతకంలో ఉన్న శని దోషం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

జాతకం ప్రకారం శని దోషం తొలగిపోవాలంటే నిత్యం శనీశ్వరుడిని పూజించాలి. అలాగే శనివారాలలో నల్ల నువ్వులను పేదలకు దానం చేయటం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శని దోషం వల్ల మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతుంటే ఆ దోషం తొలగిపోవడానికి శనివారం రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయటమే కాకుండా శనివారం రోజున పేదలకు అన్నదానం చేయటం వల్ల శని దోషం తొలగిపోయి మనం చేపట్టిన పనులు నెరవేరుతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.