పూజ పూర్తి అయిన తర్వాత కర్పూర హారతి ఇవ్వడం వెనుక ఇంత స్టోరీ ఉందా?

సాధారణంగా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇలా పూజా కార్యక్రమాలలో భాగంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు.ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా భగవంతుడికి వివిధ రకాల పుష్పాలను సమర్పించడమే కాకుండా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తాము అదేవిధంగా పూజ పూర్తి అయిన అనంతరం కర్పూర హారతి ఇస్తాము.

ఈ విధంగా స్వామివారికి పూజ చేసిన అనంతరం కర్పూర హారతి ఇవ్వడానికి గల కారణం ఏంటి ఇలా కర్పూర హారతులు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా కర్పూర హారతి ఇవ్వడం వెనక కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. స్వామివారికి కర్పూరాన్ని సమర్పించినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని కర్పూర రూపంలో స్వామివారికి సమర్పించినట్టు అర్థం.

ఇలా కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వడం వల్ల మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం దహించి కరిగించి వేస్తుందని అర్థం అందుకే పూజ పూర్తి అయిన తర్వాత స్వామివారికి కర్పూర హారతి ఇవ్వడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం కూడా తొలగిపోతుందని భావిస్తారు.ఇక కర్పూర హారతులు ఇవ్వడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో ప్రశాంతతను కూడా కల్పిస్తుందని చెప్పాలి.