దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులు కావాలంటే తమలపాకుతో ఈ పరిహారాలు చేయాల్సిందే!

మన హిందూ సంస్కృతిలో తమలపాకులు పరమ పవిత్రంగా భావిస్తారు. అందువల్ల శుభకార్యాలలో కచ్చితంగా తమలపాకుని ఉంచుతారు. అంతే కాకుండా పూజా కార్యక్రమాలలో కూడా తమలపాకు కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవతలకు సమర్పించే తమలపాకులను కొన్నిసార్లు దేవుడిగా కూడా పూజిస్తారు. హనుమంతుడికి తమలపాకు చాలా ఇష్టమైనది. అందువల్ల మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకులు సమర్పించి పూజిస్తారు. జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొచ్చే తమలపాకుకు సంబంధించిన కొన్ని ఖచ్చితమైన నివారణల గురించి తెలుసుకుందాం.

• హనుమంతుడికి ప్రతి మంగళవారం రోజున తమలపాకులు సమర్పించి పూజించటం వల్ల ఆ హనుమంతుడి అనుగ్రహం పొందవచ్చు. ఇలా తమలపాకులో సమర్పించి హనుమంతుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి.
• ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆదివారం రోజున ఇంట్లో నుండి వెళ్లేటప్పుడు తమలపాకులు తీసుకొని వెళ్లడం వల్ల చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది.
• సోమవారం రోజున సోపు, తమలపాకులు, కాటేచు కలిపి గుల్కండ్‌తో చేసిన పాన్‌ శివుడికి సమర్పించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు.
• వ్యాపారంలో లాభాలు లేక సతమవుతున్న వారు శనివారం నాడు మీ ఆఫీసులో ఐదు తమలపాకులతో పాటు ఐదు రావి ఆకులను దండగా చేసి తూర్పు దిశగా ఉన్న ముఖద్వారానికి కట్టటం వల్ల వ్యాపారంలో పురోగతి సాధించారు.