ఆంజనేయస్వామిని ఇలా పూజిస్తే కోరిన కోరికలు తీరతాయట.. మంగళవారం ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఎంతో ఇష్టపడే దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరనే సంగతి తెలిసిందే. హిందువులకు ప్రీతికరమైన ఈ దేవుడు కోరిన ప్రతి కోరికను నెరవేరుస్తాడని చాలామంది భావిస్తారు. ఆంజనేయ స్వామిని మంగళవారం పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే పూజించే సమయంలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం అనుకూల ఫలితాలను పొందలేము.

మంగళవారం రోజున హనుమంతుని ఆలయంలో సీతా మాత పాదాల దగ్గర సింధూరం పూసి పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. కష్టాలతో సతమతం అవుతున్నవారు ఆంజనేయస్వామిని 41 రోజుల పాటు పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

హనుమంతునికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం కాగా తమలపాకులతో హనుమంతుడిని పూజించడం వల్ల సులభంగా అనుకూల ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. హనుమంతుడిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయని చాలామంది ఫీలవుతారు. రావి ఆకులను శుభ్రం చేసి కుంకుమతో శ్రీరామ అని రాస్తే అనుకూలంగా పనులు జరుగుతాయి.

చిన్న పిల్లలకు మెడలో దేవుని బిళ్ల వేస్తే శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి కార్యం తలపెట్టినా హనుమంతుడిని పూజించి పనిని మొదలుపెడితే కచ్చితంగా మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సుందరకండ పారాయణం చేయడం ద్వారా పిల్లలు లేని దంపతులకు సులభంగా పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది.