శివరాత్రికి ముందు కలలో ఈ సంకేతాలు కనిపిస్తే శివుని అనుగ్రహం మీపై ఉందని అర్థం తెలుసా?

shiva

భోళాశంకరుడు,పరమేశ్వరుడు, శివుడు ఇలా ఎన్ని రకాల పేర్లతో పిలిచినా భక్తుల మొర ఆలకించి వారి కష్టాలు తీర్చే శివుడిని అందరూ భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం రోజున శివున్ని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి శుభం జరుగుతుంది అని ప్రజల నమ్మకం. ముఖ్యంగా సమాజంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే శివరాత్రి పండుగ రోజున శివుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షలో ఉండటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. మాఘ మాసంలో భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో శివున్ని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. శివుడి అనుగ్రహం మనపై ఉందని తెలపటానికి శివరాత్రికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

ఈ ఏడాది మహా శివరాత్రి పండుగను ఫిబ్రవరి 18న జరుపుకుంటారు. శివరాత్రి పర్వదినాన స్వామి వారి అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. మహా శివ రాత్రికి ముందు లింగానికి పాలతో అభిషేకం చేస్తున్నట్లు మీకు కల వస్తే.. మీ పై స్వామీ అనుగ్రహం ఉందని సంకేతం. ఇలా కల వస్తే మీ కష్టాలు దూరం అయ్యి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. అలాగే శివుడి స్వరూపంగా భావించే రుద్రాక్ష కలలో కనిపించటం వల్ల కూడా శివుడి అనుగ్రహం మీ పై ఉందని తెలిపే సంకేతం. ఇలా కలలో రుద్రాక్ష కనిపిస్తే శివుని అనుగ్రహంతో మీ బాధలు, రోగాలు, దోషాలు అన్ని దూరమవుతయాని అర్థం చేసుకోవచ్చు.

శివరాత్రికి ముందు కలలో నాగదేవత కనిపించడం అనేది ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద పెరుగుదలకు సంకేతంగా భావిస్తారు. అలాగే శివరాత్రి కి ముందు మీ కలలో శివుడు పార్వతి కలిసి కూర్చున్నట్లు కనిపిస్తే మీకు మంచి జరుగుతుందని తెలిపే సంకేతం. ఇలా కలలో శివపార్వతుల జంటగా కనిపించడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని తెలిపే సూచన. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివున్ని పూజించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అలాగే శివరాత్రి రోజున జాగరణ చేసి శివనామ స్మరణ చేయటం వల్ల శివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.