ఇంట్లో శంఖవును పెట్టుకున్నారా… అయితే ఈ నియమాలు తప్పనిసరి!

చాలా మంది వారి ఇంటిలో అలంకరణ వస్తువుగా శంఖవును పెట్టుకోవడం మనం చూస్తుంటాము. అయితే కొందరు ఈశంఖం ఆధ్యాత్మికంగా భావించగా, మరికొందరు అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తుంటారు. అయితే శంఖాన్ని ఎప్పుడూ కూడా అలంకరణ వస్తువుగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా పూజించడం మంచిదని, ఈ పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని చెప్పాలి. లక్ష్మీదేవితో పాటు సముద్ర గర్భం నుంచి శంఖం కూడా ఉద్భవించింది అందుకే శంఖం సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు.

అయితే ఇంట్లో శంఖం ఉన్నప్పుడు శంఖవును ఏ విధంగా పూజించాలి అనే విషయం తెలియక చాలామంది ఎంతో సతమతమవుతుంటారు. అయితే శంఖాన్ని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే… శంఖం మన ఇంట్లో ఎల్లప్పుడూ దేవుడి గదిలోనే ఉంచాలి. వెండి పళ్లెంలో బియ్యం పై శంఖవును ఉంచి పూజించాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం అమావాస్య,పౌర్ణమి రోజున శంఖాన్ని పసుపు నీటితో శుభ్రం చేసి అనంతరం పాలతో అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేసిన తర్వాత ప్రతి రోజు దూప దీపం వేసి పూజించాలి.

ఈ విధంగా శంఖవును పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి ఆ ఇంట అదృష్టం ,లక్ష్మి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే మన ఇంట్లో పెట్టుకునే శంఖం తెలుపు రంగులో ఉండటం ఎంతో మంచిది. ఇలా ప్రతి రోజూ పూజలు చేస్తూ వారానికి ఒకసారి పసుపుకుంకుమలతో పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సర్వ సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.