మంగళ శుక్రవారాలలో డబ్బును అప్పుగా ఇవ్వకూడదా…. శాస్త్రం ఏం చెబుతుంది!

సాధారణంగా మంగళవారం శుక్రవారం చాలామంది డబ్బును ఖర్చు చేయడానికి లేదా ఇతరులకు అప్పుగా ఇవ్వడానికి చాలా వెనకడుగు వేస్తారు. మంగళవారం కుజ గ్రహానికి అధిపతి అలాగే కుజుడు యుద్ధ కారకుడు అందుకే మంగళవారం రోజున డబ్బు ఎవరికైనా అప్పుగా ఇస్తే తిరిగి రాదని చాలామంది మంగళవారం ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వరు.అదేవిధంగా శుక్రవారం మహాలక్ష్మికి ఎంతో ప్రత్యేకమైన రోజు ఇలా లక్ష్మీవారం అయినటువంటి శుక్రవారం రోజున డబ్బు అప్పుగా ఇవ్వటం వల్ల తిరిగి ఆ డబ్బు రాదని భావిస్తారు.

ఈ కారణం చేతనే మంగళవారం శుక్రవారం ఇతరులకు డబ్బు ఇవ్వడం లేదా డబ్బును ఖర్చు చేయడం వంటివి చేయరు.అయితే నిజంగానే మంగళవారం శుక్రవారం డబ్బులు అప్పుగా ఇవ్వకూడదా? శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే మంగళ శుక్రవారాలలో డబ్బును అప్పుగా ఇవ్వకూడదని డబ్బును ఖర్చు చేయకూడదని ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఇది కేవలం మన అపోహ మాత్రమే.ఇలా మంగళ శుక్రవారంలో డబ్బును అప్పుగా ఇవ్వకూడదని ఏ శాస్త్రంలో లేకపోయినప్పటికీ వారంలో ఏడు రోజులు మాత్రం సంధ్య సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతుంది.

వారంలో ఏడు రోజులపాటు సంధ్య సమయం అయిన తర్వాత ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా డబ్బులు ఖర్చు చేయడం వంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారి నుంచి దూరం అవుతుందని శాస్త్రం చెబుతుంది. అందుకే సంధ్యా సమయంలో కాకుండా సూర్యోదయం సమయంలో డబ్బులు మనం ఇతరులకు అప్పుగా ఇవ్వవచ్చు లేదా అప్పుగా తీసుకోవచ్చు కానీ సంధ్య సమయం మాత్రం డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచిది కాదు.