నిద్ర అనేది ఒక మనిషిని ఎంతో ఒత్తిడి నుంచి అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పగలు ఎంత పని చేసినా రాత్రి ప్రశాంతమైన నిద్రను కావాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం నిద్రపోయిన మరుక్షణమే కొన్ని రకాల పీడకలలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి కలలు రావడం వల్ల అర్ధరాత్రి మెలకువ వచ్చి ఇక నిద్ర పట్టకపోవడం అనే సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలున్నాయిని నిపుణులు చెబుతున్నారు.
సరిగా నిద్ర పట్టని వారికి కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో నిద్ర పోయే ముందు చిన్న పద్ధతులను పాటించడం ద్వారా నిద్రాభంగాల నుంచి బయట పడొచ్చని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రకుపక్రమించే ముందు ఏ దిశలో తల పెట్టి పడుకుంటున్నారనేది చూసుకోవాలంటున్నారు. పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి పీడ కలలు రాకుండా ఉండాలంటే మనం నిద్రపోయే గదిలో ఉప్పును ఉంచడం ఎంతో మంచిది.
మనం నిద్రపోయే గదిలో నాలుగు మూలల్లో కాస్త రాతి ఉప్పును పోస్తే గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లను మనం మంచం పక్కన పెట్టుకొని తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలని సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల గదిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. పీడ కలలు మరీ ఎక్కువగా వస్తుంటే.. నిద్రకు వెళ్లే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవాలని చెబుతున్నారు. ఈ చిన్న పరిహారాలను పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు.