పరమేశ్వరుడి పూజలో ఎందుకు సింధూరం పసుపు ఉపయోగించరో మీకు తెలుసా?

అభిషేక ప్రియుడు అయినటువంటి పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి పూజించిన ఆయన కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు.ఇలా శివుడు అభిషేక ప్రియుడు కావడంతో ఈయనకు వివిధ రకాల పదార్థాలతో పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో కూడా పూజలు చేస్తుంటారు. కానీ పరమేశ్వరుడి పూజలో పొరపాటున కూడా పసుపు కుంకుమలను ఉపయోగించరు. కేవలం చందనం మాత్రమే ఉపయోగిస్తుంటారు.

 

ఈ విధంగా పరమేశ్వరుడి పూజలో పసుపు కుంకుమలను ఎందుకు ఉపయోగించరు అనే విషయానికి వస్తే…వాస్తవానికి హిందూ మతంలో పసుపు కుంకుమలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలోని స్త్రీలు తమ భర్త ఆయుష్య క్షేమంగా ఉండాలని భావిస్తూ కుంకుమను మొదటిపై కూడా ధరిస్తారు అయితే పరమేశ్వరుడు సంహారం చేసే ఒక అవతారం అందుకే ఆయనకు కుంకుమతో పూజ చేయరు.

 

ఇక పసుపుతో కూడా పరమేశ్వరుడిని ఎప్పటికీ పూజించరు ఇలా పసుపుతో పూజించకపోవడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే…గ్రంధాల ప్రకారం.. శివలింగం పురుష మూలకానికి చిహ్నం. అయితే పసుపు అనేది స్త్రీలకు సంబంధించినది కనుక పరమేశ్వరుడి పూజలో పసుపును కూడా ఉపయోగించరు.అయితే మహాశివరాత్రి రోజు మాత్రమే కాకుండా ఇతర రోజులలో కూడా పరమేశ్వరుడికి పసుపు కుంకుమలను పూజలో ఉపయోగించరు.