శివుడికి నైవేద్యంగా వీటిని పొరపాటున కూడా సమర్పించకూడదు…?

హిందూ సంస్కృతి ప్రకారం దేశ ప్రజలందరూ ప్రతిరోజు వారి ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఇలా చాలామంది భక్తులు వారి ఇష్ట దైవమైన శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి కేవలం నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిక కోరికలు తీరుస్తాడు. అందువల్ల శివుడిని అనేక పేర్లతో పిలుస్తారు. ఎక్కడ చూసినా కూడా శివుడు కేవలం లింగ రూపంలో మాత్రమే దర్శనం ఇస్తాడు. ఇతర దేవుళ్ళను పదాలు తాకి నమస్కరిస్తారు..కానీ శివ లింగానికి శిరస్సు తో తాకి నమస్కరిస్తారు. ఇలా మహిమాన్వితమైన శివలింగాన్ని ప్రతిరోజు పూజించటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. శివుని పూజించే సమయంలో కొన్ని రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఏ వస్తువులను శివునికి నైవేద్యంగా సమర్పించకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు ఉపయోగించరాదు. పసుపు ఉపయోగించి శివుడిని పూజించడం వల్ల ఆయన ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. పసుపుకి వేడీస్వభావం ఉంటుంది. అందువల్ల శివలింగానికి పసుపు పూ సినప్పుడు శివలింగం వేడెక్కుతుంది. అందువల్ల శివలింగానికి కేవలం గంధం మాత్రమే పూయాలి.

అలాగే పరమ పవిత్రమైన బిల్వపత్రాలతో శివునికి పూజ చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అయితే కొంతమంది తెలియక బిల్వపత్రాలతో పాటు తులసి ఆకులు కూడా సమర్పిస్తారు.పురాణాల ప్రకారం శివుడు తులసి భర్త అసుర జలంధరుని వధించాడు. అందుకే తులసి పరమశివునిపై కోపించి అతీంద్రియ, దైవిక గుణాలు కలిగిన ఆకులను దూరం చేసింది.

అలాగే శివ పూజలో కుంకుమ లేదా వెర్మిలియన్ ని ఉపయోగించకూడదు. ఎందుకంటే వెర్మిలియన్ , కుంకుమను వివాహిత స్త్రీలకు ఆభరణాలుగా పరిగణిస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు ఆరోగ్యవంతమైన జీవితం కోసం వెర్మిలియన్‌ను పూస్తారు. అయితే శివుడికి కుంకుమ సమర్పించడం వల్ల కూడా శివుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. భర్తకి అనేక సమస్యలు ఎదురవుతాయి.