ఆర్థిక సమస్యలు దూరమై ధనవంతులు కావాలంటే తమలపాకుతో ఈ పరిహారాలు పాటించాలి..?

మన హిందూ సంస్కృతిలో కొన్ని రకాల చెట్లను దేవుడితో సమానంగా భావించి పూజిస్తూ ఉంటారు. మరి కొన్నింటిని పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా పూజలలో ఉపయోగించే ఆకులలో తమలపాకు కూడా ఒకటి. తమలపాకులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందువల్ల వీటిని పూజలలో శుభకార్యాలలో ఉపయోగిస్తారు. తమలపాకులు లేకుండా చేసే పూజ అసంపూర్ణంగానే ఉంటుంది. అలాగే ఈ తమలపాకులను బంధుమిత్రులకు తాంబూలంగా ఇవ్వటానికి కూడా ఉపయోగిస్తారు. తమలపాకుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా ఆర్థిక సమస్యలను కూడా దూరం చేయవచ్చు. తమలపాకులతో కొన్ని రకాల పరిహారాలు పాటించి ఆర్థిక సమస్యలు ఎలా దూరం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఒక తమలపాకు రెండు లవంగాలను నెయ్యిలో ముంచి పెనం మీద ఉంచాలి. తర్వాత ఆకుని పెనం మీద వేడి చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. . అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకును ఉంచాలి. ఆ తమలపాకుపై కుంకుమను నానబెట్టి తిలకం వేయాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ తిలకం పెట్టుకొని బయటికి వెళ్లడం వల్ల అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అవుతారు.

అలాగే మంగళవారం లేదా శనివారం హనుమంతునికి తమలపాకులను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఇష్టపడ తబలపాకులతో ఆకు పూజ చేయించటం వల్ల మనం అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు, వ్యాపారంలో నష్టపోతున్న వారు ఈ పరిహారం పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కుటుంబసభ్యుల మద్య గొడవలు జరుగుతూ ఉంటే సాయంత్రం తమలపాకు మీద కర్పూరం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల కలహాలు తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు.