ప్రస్తుత కాలంలో ప్రజలు ఒరుకులో పరుగుల జీవితాంతంతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఈరోజుల్లో మనిషి జీవించడానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల డబ్బు సంపాదించడం కోసం ఉదయం లేచిన దగ్గర నుండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కుటుంబంలో బయట ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా మరికొంతమంది జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వారు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ నిరాశ చెందుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇంటి వాస్తు దోషాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే ఇల్లు కట్టేటప్పుడు వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. అంతే కాకుండా రాగి తో తయారు చేసిన సూర్యుడి ఇంట్లో ఉంచటం వల్ల కూడా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు. అయితే, రాగి లోహంతో చేసిన సూర్యుడిని ఇంట్లో ఏ దిక్కున ఉంచడం వల్ల కుటుంబానికి సూర్య భగవానుడి ఆశీర్వాదం, సానుకూల శక్తి ఆ ఇంట్లో ప్రవేశిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం… రాగి లోహం తో తయారు చేసి a సూర్యుడు, అంగారక గ్రహానికి సంబంధించినది. అందుకే ఈ సూర్యుడి ప్రతిమను మీ ఇంటి బాల్కనీలో తప్పనిసరిగా ఉంచాలి. వాస్తు ప్రకారం బాల్కనీకి తూర్పు దిశలో రాగి సూర్యుడిని ఉంచడం శుభప్రదమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నశించడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి
అయితే రాగి లొహంతో తయారు చేయబడిన సూర్యుడి ప్రతిమ ఇంట్లో ఉంచడానికి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. రాగి లోహపు సూర్యుడి విగ్రహం ఇంటికి తూర్పు దిశలో మాత్రమే వేలాడదీయాలి. కానీ దాని ముందు కిటికీ లేదా రహదారి లేని ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు మధురంగా ఉంటాయి.