మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఇప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రజలకు చాలా నమ్మకం ఉంది. అలాగే వాస్తు శాస్త్రం పట్ల కూడా ప్రజలు అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందువల్ల నూతన ఇంటి నిర్మాణ పనులు చేపట్టినప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం నియమాలను పాటించి ఇంటిని నిర్మిస్తారు. వాసు నియమాల ప్రకారం వెంటనే నిర్మించడమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకుంటారు. ఇలా వాస్తు నియమాలను అనుసరిస్తూ ఇంటిని నిర్మించటం తో పాటు కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా వాస్తు దోషం తొలగించవచ్చు.
వాస్తు దోషం ఉండటం వల్ల ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కూడా మొదలవుతాయి. ఇంట్లో ఉన్న ప్రతి గది వాస్తు ప్రకారం ఉండాలి. ముఖ్యంగా వంటగదిని ఎప్పుడు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఒకవేళ ఇంట్లో వంటగది సరైన దిక్కులో లేకపోతే వంట గదిలో ఎర్రటి బల్బుని వేసి ఉంచండి అప్పుడు వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలానే ఇంటి ముఖద్వారం వద్ద అలాగే వంటగది ముఖ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉంచటం వల్ల కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే వాస్తూ నిపుణులను సంప్రదించి వారి సూచనల ప్రకారం వంటగదిలో చిన్న చిన్న మార్పులు చేయించాలి.
వాస్తు దోషం వల్ల ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా తరచూ నష్టాలు వస్తూ ఉంటాయి. వాస్తు దోషం వల్ల వ్యాపారం వృద్ధి చెందాక పోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో దుకాణాలలో లేదా వ్యాపార సంస్థలలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచి పూజించటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెంది అంచలంచలుగా పైకి ఎదుగుతారు. వాస్తు దోషం తొలగిపోవడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.