ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా… ఉగాది పండుగకు ముందే వీటిని బయట పడేయండి?

సాధారణంగా మన హిందూ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగలలో ఉగాది పండుగ ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదలైన రోజున ఈ ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఇలా ఉగాది పండుగ అంటేనే వారం పది రోజుల ముందు నుంచి ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రం చేసుకొని పండుగకు కావలసిన సామాగ్రాన్ని తెచ్చుకుంటూ బిజీగా ఉంటారు.తెలుగు ప్రజలకు ఎంతో ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

పండుగ కంటే ముందుగా ఇంటిని శుభ్రం చేస్తున్న తరుణంలో ఇంట్లో కనుక ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే పడేయడం మంచిదని పండితులు చెబుతున్నారు ఈ వస్తువుల కనుక ఇంట్లో ఉంటే పరమ దరిద్రం కలుగుతుందని, మనపై తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఏర్పరుస్తాయని చెప్పాలి. అందుకే ఈ వస్తువుల కనక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించడం ఎంతో మంచిది. ఇక ఇంట్లో కనుక విరిగిపోయిన దేవుడి విగ్రహాలు కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసుకెళ్లి పారుతున్న నీటిలో నిమర్జనం చేయడం ఎంతో మంచిది.

ఇక ఇంట్లో పగిలిపోయిన అద్దం లేదా పగిలిపోయిన కాజు వస్తువులు కూడా పెట్టుకోవడం మంచిది కాదు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ఆ ఇంటి పై కుటుంబ సభ్యులకు వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.పండగ కంటే ముందుగానే మన ఇంట్లో ఉన్నటువంటి ఇలాంటి విరిగిపోయిన పగిలిపోయిన విగ్రహాలను గాజు వస్తువులను బయటపడేయడం ఎంతో మంచిది. ఇంకా ఇంట్లో ఆగిపోయిన గడియారం ఒక వ్యక్తి అదృష్టాన్ని కూడా ఆపేస్తుంది. అందువల్ల ఇంట్లో గడియారం పనిచేయడం మానేస్తే దానిని వెంటనే రిపేరు చేయించాలి లేదా వాటిని బయట పడేయాలి.